సినీనటుడు శివాజీ సినిమాల్ని వదిలేసి ఏపీ ప్రత్యేక హోదా సాధన విషయంలో తీవ్రంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా మీదా నిజాయితీగా తన వాదనను వినిపిస్తూ.. ఏ మాత్రం అవకాశం దొరికినా.. ప్రత్యేక హోదాపై గళం విప్పుతున్న వ్యక్తిగా శివాజీ వ్యవహరిస్తున్నారు.
ప్రత్యేక హోదా విషయంలో ఆమరణ నిరాహార దీక్ష మొదలు.. ఆయన చాలానే ఆందోళన చేయటం తెలిసిందే. ప్రత్యేక హోదా విషయంపై లోక్‌సభలో సంతృప్తికర సమాధానం రాకపోవటం.. వెంకయ్యనాయుడి వైఖరిపై గుర్రుగా ఉన్న శివాజీ తాజాగా ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
వెంకయ్యనాయుడు ఎక్కడ పోటీ చేసినా ఏడెనిమిది వేల కంటే ఓట్లు ఎక్కువ రావని.. రాజకీయ పబ్బం గడుపుకునేందుకే కేంద్రాన్ని.. బీజేపీని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం గతంలో రాజ్యసభ లో పోరాడిన వెంకయ్య.. ఇప్పుడు ఆ అవసరం లేదని ఎలా అంటున్నారని.. ఇదెంత వరకు న్యాయమని ఆయన ప్రశ్నిస్తున్నారు.
వెంకయ్య మీద విరుచుకుపడిన ఆయన.. మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ప్రత్యేక హోదా అంశంపై పోరాటం చేయాలంటూ అభ్యర్థించారు. పవన్ కల్యాణ్ నీ రోడ్డు ఎక్కి ప్రత్యేక హోదా గురించి గళం విప్పితే.. ప్రత్యేక హోదా వచ్చేస్తుందని వ్యాఖ్యానించారు.
ప్రత్యేక హోదాతో ఎలాంటి ప్రయోజనం లేదని కొందరు మూర్ఖులు మాట్లాడుతున్నారని.. బీజేపీ నేతల పుణ్యమా అని ప్రత్యేక హోదా నినాదం పక్కదారి పడుతుందని విమర్శ చేశారు. విపక్ష నేత జగన్ తో సహా ఎవరు దీక్షలు చేసినా ఏపీ ప్రత్యేక హోదాకు ప్రయోజనం కలుగుతుందన్నారు.