శివాజీ చుట్టూ ఏపీ రాజ‌కీయం!

Update: 2018-10-29 16:30 GMT
స‌హ‌జంగా గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు ఆయా రాజ‌కీయ పార్టీలు ఫిర్యాదు చేయ‌డం అనేది రాజ‌కీయంగా టార్గెట్ చేసిన నాయ‌కులు లేదా పార్టీల విష‌యంలోనో చేస్తుంటాయి. పైగా - పార్టీని టార్గెట్ చేసుకునేందుకు కూడా స‌హ‌జంగా గ‌వ‌రర్న్‌ను టార్గెట్ చేసుకునే సంద‌ర్భాలు అరుదు అనే చెప్ప‌వ‌చ్చు. అయితే, తాజాగా ఓ వ్య‌క్తిపై ప్ర‌ధాన పార్టీ ఫిర్యాదు చేసింది. ఏకంగా ఆయ‌న్ను అదుపులోకి తీసుకోవాల‌ని కోరింది. ఆయ‌నే ఏపీ రాజ‌కీయాల్లో నాయ‌కుల కంటే ఎక్కువ పాపుల‌ర్ అయిన సినీన‌టుడు శివాజీ. ఆప‌రేష‌న్ గ‌రుడ పేరుతో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు - త‌ద‌నంత‌ర ప‌రిణామాలు ఈ చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి.

ఏపీ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని ఆప‌రేష‌న్ గ‌రుడ పేరుతో శివాజీ సంచ‌ల‌న విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతోపాటుగా ప‌లు సంచ‌న‌ల అంశాల‌ను ఆయ‌న బ‌య‌ట‌పెడుతూ రాష్ట్రంలోని ముఖ్య‌నేత‌ల‌తో పాటుగా జాతీయ స్థాయి నాయ‌కుల‌ను సైతం ఇందులోకి లాగారు. అనంత‌రం తాజాగా ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్‌ పై జ‌రిగిన దాడి విష‌యంలో కూడా ఆయ‌న పేరు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. ఆయ‌న ప్ర‌స్తావించిన ఆప‌రేష‌న్ తెర‌మీద‌కు వ‌చ్చింది. తాజాగా , ఏకంగా బీజేపీ ఆయ‌న పేరును ప్ర‌స్తావిస్తూ...గ‌వ‌ర్న‌ర్‌ కు ఫిర్యాదు చేసింది. శాంతిభద్రతలు - నిరుద్యోగ సమస్యలపై పిర్యాదు చేశామ‌ని బీజేపీ నేత‌లు తెలిపారు. అమిత్‌ షా మొదలుకొని ప్రతిపక్ష నేత జగన్ పై దాడులు జరుగుతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాయి. శాంతి భద్రతలు విఫలమయ్యాయని బీజేపీ నేత‌లు ఆరోపించారు. శివాజీ కూడా ఆపరేషన్ గరుడ లాంటి వ్యాఖ్యలు చెస్తున్నార‌ని అన్నారు. శివాజీ దగ్గర చాలా సమాచారం ఉందని, శివాజీని కస్టడీ లోకి తీసుకుని విచారించాల‌ని బీజేపీ నేత‌లు డిమాండ్ చేశారు. గవర్నర్ పరమర్శిస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఆంద్రప్రదేశ్‌ లో భద్రత ఎవరికి లేదని, కావాలని చంద్రబాబు అనేక ఆరోపణలు చేస్తున్నారు.

Tags:    

Similar News