బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ కు తాజాగా అమెరికాలో చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. తనిఖీల పేరుతో గంటల తరబడి ఎయిర్ పోర్ట్ లోనే నిలిపివేసిన అమెరికా తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. గడిచిన ఏడేళ్ల వ్యవధిలో మూడుసార్లు అమెరికా ఎయిర్ పోర్ట్ లో నిర్బంధించి ఇబ్బంది పెట్టిన వైనం పలువురు తప్పు పడుతున్నారు. ఈ ఘటన మీడియాలో ప్రముఖంగా వచ్చిన తర్వాత భారత్ లోని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ విచారం వ్యక్తం చేసి.. క్షమాపణలు చెప్పుకొచ్చారు.
అమెరికాలో షారూక్ కు జరిగిన అవమానంపై శివసేన సీరియస్ అయ్యింది. ఆ పార్టీ పత్రిక సామ్నాలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. షారూక్ కు జరిగిన అవమానంపై తీవ్రంగా స్పందించింది. అమెరికాలో చేదు అనుభవం ఎదురైన షారూక్ వెంటనే స్వదేశానికి వచ్చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తనను అవమానించిన అమెరికాను చెంపదెబ్బ కొట్టినట్లుగా వ్యవహరిస్తూ వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చేసి ఉండాల్సిందంటూ.. ‘‘ఈ విధంగా నన్ను అవమానిస్తే మీ దేశంలో అడుగుపెట్టను’’ అని షారూ అనేసి అమెరికా నుంచి తిరిగి వచ్చేసినట్లైతే బాగుండుదని వ్యాఖ్యానించింది.
షారూక్ ఖాన్ కానీ ఆ పని చేసి ఉంటే.. ముఖం మీద చెంపదెబ్బ కొట్టినట్లుగా ఉండేదంది. ప్రతి ముస్లింను అమెరికా తీవ్రవాదిగా భావిస్తోందంటూ విమర్శించిన సామ్నా.. కశ్మీర్ యువత పెడదారి పట్టకుండా షారూక్ బాధ్యత తీసుకొని.. వారికి దిశా నిర్దేశం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది.