ఎంత కన్న కొడుకు అయితే మాత్రం దరిద్రపుగొట్టు పనులు చేస్తే.. ఆ తప్పును ఖండించకుండా వారిని వెనకేసుకొచ్చే అమ్మల్ని చూస్తుంటాం. చివరకు ఉగ్రవాద చర్యలకు పాల్పడే వారు.. దారుణ అత్యాచారాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొనే వారి అమ్మల తీరు ఒళ్లు మండేలా చేస్తుంటుంది. అందుకు భిన్నంగా తన కొడుకు చేసిన చెత్త పనికి తాట తీసేలా వ్యవహరించిన ఈ అమ్మనిలువెత్తు స్ఫూర్తిగా చెప్పాలి. చెడు అలవాట్లతో చెడిపోతున్నకొడుక్కి మంచి మాటలు చెప్పి మార్చాలని ప్రయత్నించిన ఆ తల్లి విసిగిపోయింది.
అయినప్పటికి మారని కొడుకు తీరుకు చిరాకు వచ్చిన ఆమె కన్నెర్ర చేసింది. ఈ ఉదంతం సూర్యాపేట జిల్లా కోదాడలో చోటు చేసుకుంది. తాజాగా దీనికి సంబంధించిన ఒక ఉదంతం వైరల్ గా మారింది. కోదాడ పట్టణంలోని గాంధీనగర్ కు చెందిన తొమ్మిదోతరగతి చదివే ఒక విద్యార్థి ఏడాదిగా గంజాయికి అలవాటు పడ్డాడు.
కొడుకు పాడు పనితో వేదన చెందిన ఆ తల్లి కొడుకును మార్చేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నించింది. అయినా ఆ విద్యార్థి తీరు మారలేదు. చదువు మీద మనసు పెట్టాలని.. గంజాయి భూతానికి దూరంగా ఉండాలని ఎంత కోరినప్పటికి మారని కొడుకు తాట తీసేందుకు వెనుకాడలేదు.
తన కొడుకు మాదిరి తప్పులు చేసే వారికి ఎలాంటి షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వాలో తెలియజేసేలా ఆమె తీరు ఉందన్న మాట వినిపిస్తోంది. తాను ఎంత చెప్పినా మాట వినని కొడుకును కరెంటు స్తంభానికి కట్టేసి కళ్లల్లో కారం కొట్టింది. గంజాయి మత్తులో ఉన్న కొడుకు మత్తు దిగిపోయి.. మళ్లీ ఆ తప్పు చేయనని.. బుద్ధిగా నడుచుకుంటానని చెప్పటం ఆ కొడుకు వంతైంది.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో గంజాయి.. మత్తు మందుల వినియోగం భారీగా పెరిగిపోవటం.. హైదరాబాద్ మహానగరంలో ఇటీవల కాలంలో దీనికి సంబంధించిన ఉదంతాలు పెద్ద ఎత్తున బయటపడుతున్న నేపథ్యంలో ఈ తరహా ఉదంతం చాలామంది తల్లులకు ఒక చక్కటి దారిని చూపిస్తుందని చెప్పాలి.
Full View

కాకుంటే.. కన్నకొడుకును తమ ప్రేమతో చెడగొట్టే కన్నా.. చెడు అలవాట్ల బారిన పడిన వారిని అవసరమైనప్పుడు తాట తీయాల్సిన అవసరం కూడా ఉందన్నది మర్చిపోకూడదు.