ఓ వక్తిని కొట్టి.. రోడ్డు పై ఉన్న ఉమ్మిని నాకించి..: జార్ఘండ్ లో ఘోరం..
నరేంద్ర మోదీ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఓ వక్తిని కొట్టడమే కాకుండా.. అతన్ని మోకాళ్ల పై కూర్చొబెట్టి బలతవంతంగా అతనితో రోడ్డు పై ఉన్న ఉమ్మి నాకించారు. ఆ తరువాత గుంజీలు తీయించి ‘జై శ్రీరామ్’ అనే నినాదాలు చేయించారు. ఈ ఘటన స్థానిక ఎమ్మెల్యే అక్కడడుంగానే జరగడం గమనార్హం. జార్ఘండ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ వీడయో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరేన్ స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి, అధికారులను ఆదేశించారు. దీంతో నలుగులు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
నరేంద్రమోదీ ఇటీవల పంజాబ్ పర్యటన సందర్భంగా ఏర్పడిన భద్రతా లోపంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా జార్ఘండ్ రాష్ట్రంలోని ధన్ బాద్ గాంధీ చౌక్లో బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. అయితే అటువైపు వెళ్తున్న ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ దీపక్ ప్రకాశ్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని బీజేపీ నాయకులు అంటున్నారు. అయితే ఆ వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీని ధూషిస్తున్నా ట్రాఫిక్ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపించారు. దీంతో ఆ వ్యక్తిని చితక్కొట్టారు. అంతేకాకుండా చేయరాని పనులు చేయించారు. దీంతో ఈ విషయం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ ఘటనపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ స్పందించారు. ధన్ బాద్లో జరిగిన ఘటన బాధ్యుతలపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సామాజిక వ్యవస్థను దెబ్బతీసేందుకు ఎవరు ప్రయత్నించినా ఊరుకునేది లేదని అన్నారు. మత సామరస్యానికి విఘాతం కలిగించేవారిని ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు.
సీఎం ఆదేశాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోవైపు బాధితుడి సోదరుడు రెహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వీడియో ఆధారంగా బాధ్యులైన నలుగురు బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ ఘటనపై పూర్తిగా విచారణ జరిపి బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ ఎస్పీ మనోజ్ స్వర్గియరీ తెలిపారు. మరోవైపు ఈ ఘటపై రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. జార్ఘండ్ లోని కాంగ్రెస్, జార్ఘండ్ ముక్తి మోర్చా పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఇది అత్యంత హేయమైన చర్య అని ఇతర పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు.
అయితే ఈ విషయంపై పూర్తిగా పరిశీలిస్తామన్నారు. ఆ వ్యక్తి పై దాడి చేసింది బీజేపీ కార్యకర్తలేదా..? లేదా ఇతర శక్తులా..? అనేది తేల్చుతామన్నారు. పార్టీ కార్యకర్తలు అని తేలితే వారి పై చర్యలు తీసుకుంటామని బీజేపీ నాయకుడు సిపిసింగ్ తెలిపారు. ఓ వ్యక్తిపై ఇలాంటి దాడి చేయాలని పార్టీ నేతలు ఎవరూ కోరుకోరని, అయినా పూర్తి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Full View
Full View Full View