11 ఏళ్ల బాలికకు '3' గంటల నరకాన్ని చూపించిన కామపిశాచి

Update: 2022-01-22 04:48 GMT
ఈ ఉదంతం గురించి తెలిసినంతనే ఒళ్లు జలదరిస్తుంది. ఆడపిల్లగా పుట్టినందుకు ఇంత దారుణ అనుభవం ఎదురుకావాలా? అన్న టెన్షన్ బయలుదేరుతుంది. పదకొండేళ్ల చిరు ప్రాయంతో దారుణ నరకాన్ని చవి చూసిన ఈ బాలిక గురించి ఆలోచించినంతనే ఒళ్లంతా గగుర్పాటుకు గురి చేయటమే కాదు.. ఇలాంటి పైశాచికతను ప్రదర్శించిన మనిషి రూపంలో ఉన్న కామ పిశాచికి భయంకరమైన శిక్షను దేవుడు వెంటనే వేసేస్తే ఎంత బాగుండన్న భావన కలుగక మానదు. ఎందుకంటే.. మన చట్టాలు.. న్యాయస్థానాలు చట్టబద్ధమైన విచారణ జరిపి.. వాడికి శిక్ష పడేందుకు ఎంత టైం పడుతుందో తెలీదు. అందుకే.. ఇలాంటి రాక్షసులకు దేవుడు ఇన్ స్టెంట్ గా కోలుకోని శిక్ష వేసేస్తే సరి అన్న భావన కలుగక మానదు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేటలో అమానుష ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పదకొండేళ్ల బాలిక ఆరో తరగతి చదువుతోంది. గురువారం సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వంటకు అవసరమైన వంట చెరుకు కోసం అక్క వద్దకు బయలుదేరింది. దారిలో జీడితోటలో అదే గ్రామానికి చెందిన 22 ఏళ్ల నాగేశ్ ఆమెను బలవంతంగా పట్టుకొని.. నోట్లో గుడ్డలు కుక్కి.. దూరంగా లాక్కెళ్లాడు.

సెల్ ఫోన్ లో అశ్లీల వీడియోలు చూడాలని బలవంతం చేశాడు. ఆమె అందుకు అంగీకరించకపోవటంతో దారుణంగా కొట్టాడు. కత్తి తీసి బెదిరించాడు. నగ్నంగా చేసి.. ఆమె ఫోటోలు.. వీడియోలు తీశాడు. అన్నయ్య.. ప్లీజ్ నన్ను వదిలేయ్ అని కన్నీరు మున్నీరు అవుతున్నా.. తాను అన్నయ్యను కానని.. మామయ్యనంటూ కామ పిశాచి.. మూడు గంటల పాటు ఆ బాలికకు ప్రత్యక్ష నరకాన్ని చూపించాడు.

అనంతరం మీ అమ్మ.. అక్కలు స్నానం చేసేటప్పుడు రహస్యంగా వీడియోలు తీసి.. తనకు పంపాలని బెదిరించాడు. లేదంటే ప్రాణాలు తీస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఎవరికీ చెప్పనని ఆమె కాళ్ల మీద పడిన తర్వాత.. రాత్రి 8 గంటల వేళలో తన టూ వీలర్ మీద తీసుకొచ్చి ఇంటి సమీపంలో దించేసి వెళ్లిపోయాడు.

గాయాలైన ఆమెకు ఏం జరిగిందని తల్లిదండ్రులు ఆరా తీయగా.. ఈ దారుణం బయటకు వచ్చింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ తరహా కామపిశాచికి ఎలాంటి శిక్ష విధించాలి? ఇలాంటోడ్ని చట్టాలు శిక్షించటానికి ముందే.. ఇంకేదైనా జరగాలన్న భావన కలుగక మానదు. ఇందుకు దేవుడు మాత్రమే దిక్కు. అందుకే.. వాడ్ని దారుణంగా శిక్షించాలని కోరుతున్నాం. మా డిమాండ్ లో న్యాయం లేదంటారా?
Tags:    

Similar News