విజయవాడలో ఓ తెలంగాణకు చెందిన కుటుంబం ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. పోలీసులు ఈ ఆత్మహత్యలపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. ఫైనాన్స్ సంస్థల వేధింపులే ఈ మూకుమ్మడి ఆత్మహత్యలకు కారణమని తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
నిజామాబాద్ కు చెందిన సురేష్ కుటుంబం విజయవాడ దుర్గమ్మ దర్శనం చేసుకున్న అనంతరం సత్రంలో ఆత్మహత్య చేసుకున్నారు. తండ్రి సురేష్, తల్లి శ్రీలత, కొడుకులు ఆశిష్, అఖిల్ ఒకేసారి సూసైడ్ చేసుకున్నారు.
తల్లి శ్రీలత, ఆశిష్ ఇన్సూలిన్ తీసుకొని చనిపోయారు. తండ్రి సురేష్, మరో కొడుకు అఖిల్ కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకున్న రోజు తల్లి శ్రీలత తన అన్నకు వాట్సాప్ వాయిస్ మెసేజ్ పంపింది. ఇక సురేష్ కూడా తాను నదిలో దూకుతున్నానంటూ బంధువులకు సమాచారం ఇచ్చారు.
ఈ కుటుంబం ఆత్మహత్యకు ఓ ఫైనాన్స్ సంస్థ వేధింపులే కారణమని పోలీసులు నిర్ధారణకొచ్చారు. సురేష్ కుటుంబం విజయవాడకు వచ్చాక అతడి ఫ్లాట్ కు ఫైనాన్స్ సంస్థ సభ్యులు వెళ్లారు. తలుపులు పగులకొట్టడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత గోడలపై ఈ ఫ్లాట్ తమ సంస్థది అని ఎర్రటి అక్షరాలతో రాసి వెళ్లారు.
ఇక అంతుకుముందే ఈ కుటుంబం నిర్వహించే పెట్రోల్ బంకు, మెడికల్ షాపు వద్ద కూడా సదురు ఫైనాన్స్ సంస్థ సభ్యులు గొడవ చేసి పరువు చేసినట్లు తెలిసింది. దీంతో మనస్థాపానికి గురైన సురేష్ కుటుంబం ఇలా సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.