మాస్కు ధరించినా కరోనా ముప్పే.. అడ్డుకోవాలంటే అర్జెంట్ గా కళ్లజోడు పెట్టుకోవాలా?

Update: 2021-04-19 11:31 GMT
వినేందుకు విచిత్రంగా ఉండొచ్చు కానీ ఇది నిజం. ఇంతవరకు కరోనాకు సంబంధించి మనకు తెలిసిన అంశాలకు.. సెకండ్ వేవ్ పుణ్యమా అని.. మారిన వైరస్ మ్యుటేషన్ నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కరోనాను అడ్డుకునేందుకు ఇప్పటివరకు ముఖానికి మాస్కు.. చేతికి శానిటైజర్ ఉంటే సరిపోయేది. భౌతిక దూరంతో పాటు.. మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోయేది. కానీ.. ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల్లో కరోనా బారిన పడకుండా ఉండాలంటే.. ముఖానికి మరో రక్షణ కవచం అవసరమవుతోంది.

తాజాగా మ్యుటేట్ అయిన వైరస్ మరింత బలంగా ఉండటమే కాదు.. తన తీరును కూడా మార్చుకుంది. ఇంతకాలం ముక్కు.. నోటి నుంచి శరీరంలోకి ఎంట్రీ ఇచ్చే కరోనా.. ఇప్పుడు కళ్ల నుంచి జొరబడే లక్షణాన్ని సొంతం చేసుకున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడున్న వైరస్ కు కొన్ని ప్రత్యేక లక్షణాలు వచ్చేయటంతో కళ్ల నుంచి జొరబడే ప్రమాదకర పరిస్థితి నెలకొంది. దీంతో..  కళ్ల చుట్టూ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయాల్సిన పాడు రోజులు వచ్చేశాయి.

కరోనా పుణ్యమా అని ముఖం మొత్తాన్ని కప్పేసే మాస్కును పెట్టుకుంటున్నాం. నోరు.. ముక్కును కవర్ చేసేలా ఇవి ఉంటున్నాయి. కానీ.. ఇప్పుడున్న కరోనా స్ట్రెయిన్  కళ్ల నుంచి వ్యాపించే లక్షణం ఉంది. ఈ నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా బారిన పడకుండా ఉండేందుకు కళ్లజోడు అత్యవసరమన్న సూచనను నిపుణులు చేస్తున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో వైరస్ శరీరం లోపలకు చొచ్చుకొచ్చే అవకాశాన్ని ఇవ్వకుండా.. దాన్ని శరీరంలోకి రానివ్వకుండా అడ్డుకునే ఎన్ని మార్గాలు ఉంటే.. వాటన్నింటిని వైరస్ ను అడ్డుకోవటానికి వినియోగించుకోవటం చాలా అవసరమన్నది మర్చిపోకూడదు. సో.. ఇప్పుడున్న పరిస్థితిలో కళ్లను పూర్తిగా కప్పేసే కళ్లజోడు  ఒకటి అర్జెంట్ గా కొనేసి.. వాడటం షురూ చేయటం మంచిదన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News