అమెరికాలో మరోసారి కాల్పుల మోత ... నలుగురి మృతి!

Update: 2021-04-16 09:43 GMT
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. అమెరికాలోని ఇండియానా పోలిస్‌ మరోసారి కాల్పుల మోతతో మార్మోగిపోయింది. నగరంలోని ఫెడెక్స్ గిడ్డంగి వద్ద భారీ కాల్పులు కలకలం సృష్టించాయి.  గురువారం ఆర్థరాత్రి ఒక దుండగుడు జరిపిన ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందినట్టు ప్రసారమాధ్యమాల్లో వార్తలు ప్రచారం అయ్యాయి. పలువురు గాయాలపాలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై  బాధితులు, పోలీసులను ఉటంకిస్తూ స్థానిక మీడియా రిపోర్ట్‌ చేసింది.

అలాగే, ఈ కాల్పుల ఉదంతంపై ఫెడెక్స్ అధికారికంగా ఒక ప్రకటన విడుదలచేసింది. కాల్పుల్లో చాలామంది గాయపడ్డారని, పూర్తి వివరాలను వెల్లడించనున్నామని తెలిపింది. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది. ఇండియానా పోలిస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఫెడెక్స్ గిడ్డంగి వద్ద కాల్పులు జరిగాయని ఇండియానాపోలిస్ మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ జెనే కుక్ తెలిపారు. క్షతగాత్రుల వివరాలను వెల్లడించలేదు. అయితే , ఆ నిందుతుడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నామన్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి పలువురు సోషల్‌మీడియాలో తమ అనుభవాలను షేర్‌ చేస్తున్నారు. ఈ కాల్పుల  తరువాత నేలపై ఒక మృతదేహాన్ని చూశానని  ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.  
Tags:    

Similar News