ఇన్నాళ్లూ తన తండ్రి రాజకీయాలపై పెద్దగా స్పందించని సోనాక్షి సిన్హా ఇప్పుడు ఆ అంశంపై మాట్లాడారు. గత కొన్నాళ్లుగా భారతీయ జనతా పార్టీ తీరుపై విమర్శల వాన కురిపిస్తూ ఉన్నషాట్ గన్ శత్రుఘ్న సిన్హా ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖరారు అయ్యింది. తను ఇది వరకూ ప్రాతినిధ్యం వహించిన సీటు నుంచినే షాట్ గన్ కాంగ్రెస్ తరఫున పోటీ చేయనున్నారు.
గత ఐదేళ్లలో మోడీపై - అమిత్ షా పై శత్రుఘ్న ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో అందరికీ తెలిసిందే. అయితే ఆయనను బీజేపీ పెద్దలు పట్టించుకోలేదు. ప్రత్యేకించి మోడీ, అమిత్ షాలు ఆయనపై స్పందించడానికి కూడా ఇష్టపడలేదు. చివరకు చేసేది లేక బీజేపీకి పూర్తిగా దూరం అయ్యారు అలనాటి ఈ బాలీవుడ్ స్టార్ హీరో. చాలా కాలం నుంచినే బీజేపీలో పని చేస్తున్న ఈ బిహారీ బాబు ఇప్పుడు కాంగ్రెస్ నేతగా మారుతూ ఉన్నారు.
ఈ నేపథ్యంలో శత్రుఘ్న సిన్హా కూతురు - బాలీవుడ్ ప్రముఖ నటీమణి సోనాక్షి స్పందించింది. బీజేపీకి రాజీనామా చేసి తన తండ్రి మంచి పని చేశారని ఆమె అన్నారు. గౌరవం లేని చోట ఉండటానికి బదులుగా బయటకు రావడం మంచిదని ఆమె అన్నారు. తన తండ్రి నిర్ణయాన్ని ఈ విధంగా సమర్థించింది సోనాక్షి.
అంతకు మించిన విశేషం ఏమిటంటే.. ఆయన ఎప్పుడో బీజేపీకి రాజీనామా చేయాల్సిందని సోనాక్షి చెప్పుకురావడం. ఇప్పటికే లేట్ అయ్యిందని, ఇప్పటికైనా మంచి పని చేశారని ఆమె చెప్పుకొచ్చింది. ఆయనకు బీజేపీలో ఎప్పుడూ గౌరవం దక్కలేదని ఈ హీరోయిన్ చెప్పుకొచ్చింది! మొత్తానికి షాట్ గన్ కూతురు కూడా రాజకీయాల గురించి తండ్రికి తగ్గట్టుగానే మాట్లాడుతూ ఉంది. ఈమె కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందో ఏమో!