శ్రేయస్​ ఇప్పట్లో కోలుకోలేడు.. మరి ఢిల్లీ కెప్టెన్​ ఎవరు?

Update: 2021-03-30 05:30 GMT
టీమిండియా బ్యాట్స్​ మెన్​, ఢిల్లీ క్యాపిటల్స్​ కెప్టెన్​ శ్రేయాస్ అయ్యర్ ఇటీవల గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే శ్రేయస్​కు చాలా పెద్ద గాయమైందని డాక్టర్లు అంటున్నారు. అతడు ఇప్పట్లో కోలుకోలేడని.. దాదాపు ఆరునెలలపాటు రెస్ట్​ లో ఉండక తప్పదని వైద్యులు చెబుతున్నారు. శ్రేయస్​ ఐపీఎల్లో  ఢిల్లీ జట్టుకు కెప్టెన్​ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రేయస్​ కు గాయం కావడం ఢిల్లీకి పెద్ద దెబ్బే అని క్రికెట్​ విశ్లేషకులు అంటున్నారు.

ఇంగ్లండ్​ తో జరిగిన తొలి వన్డే లో శ్రేయస్​ అయ్యర్ కు ఎడమ భుజానికి గాయమైంది.  శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌ లో జానీ బెయిర్‌స్టో ఓ భారీ షాట్​ను కొట్టాడు. ఆ బంతిని ఆపే క్రమంలో శ్రేయస్​ కిందపడి గాయపడ్డాడు.  వెంటనే టీమ్ ఫిజియోలు మైదానానికి వచ్చి గాయాన్ని పరీక్షించగా.. దాని తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారి సూచనల మేరకు అయ్యర్  మైదానం వీడాడు.

ఆ  తర్వాత హాస్పిటల్ కు తీసుకెళ్లి పరీక్షలు చేయగా అతడి ఎడమ భుజానికి తీవ్ర గాయమైనట్టు తేలింది.  స్కానింగ్ చేయగా  అయ్యర్ ఎడమ భుజం డిస్‌ లోకేట్ అయ్యిందని తెలిసింది.ఏప్రిల్‌ 8న శ్రేయస్ అయ్యర్ కు   సర్జరీ జరగనున్నది. ఆ తర్వాత అతడు ఐదునెలల పాటు రెస్ట్ ​లో ఉండాలని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఇక శ్రేయస్​ ఐపీఎల్​ 2021లో ఆడే అవకాశాలు లేవు.ఒకవేళ అతడు కోలుకుంటే  సెప్టెంబర్‌ లో న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, టీ20 సిరీస్‌ లకు మళ్లీ జట్టులోకి చేరే అవకాశం ఉంది.

 అయితే శ్రేయస్​ స్థానంలో ఎవరిని కెప్టెన్ గా నియమించాలని ఢిల్లీ క్యాపిటల్స్​ ఆలోచిస్తున్నది. కెప్టెన్సీ కోసం ఐదుగురు పోటీలో ఉన్నట్టు టాక్​. రిషబ్ పంత్, రవిచంద్రన్‌ అశ్విన్‌, అజింక్య రహానే, స్టీవ్‌ స్మిత్‌, పృథ్వీ షా పోటీలో ఉన్నారు. అయితే వీళ్లతో పాటు శిఖర్​ ధావన్ ​కు కూడా చాన్స్​ ఉంది. కానీ శిఖర్​ ధావన్ ను కెప్టెన్​ గా పెడితే బ్యాటింగ్​ మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించలేడేమోనని యాజమాన్యం అనుమానిస్తున్నదట. అంతేకాక అతడికి అనుభవం కూడా లేదు. స్టీవ్‌ స్మిత్‌ ను ఇటీవల వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకున్నది. స్మిత్​ గతంలో ఐపీఎల్​ కెప్టెన్​ గా చేశాడు.. దీంతో అతడికే ఎక్కువ అవకాశం ఉన్నట్టు సమాచారం.
Tags:    

Similar News