అప్పుడెప్పుడో దర్శకుడు తీసిన ‘ఒకే ఒక్కడు’ సినిమా గుర్తుందా? టీవీ చానల్ కు ఇంటర్వ్యూకు వచ్చిన ముఖ్యమంత్రిని తన ప్రశ్నలతో ఇరుకున పెట్టటం.. దీంతో.. సదరు సీఎం చిరాకు పడిపోయి ముఖ్యమంత్రి పదవి అంటే ముళ్ల కిరీటం.. ఒకరోజు సీఎంను చేస్తాను.. చేస్తావా? అంటూ సవాలు విసరటం.. ఆ తర్వాత ఏమైందో వెండితెర మీదనే కాదు బుల్లితెర మీద కూడా చాలాసార్లు చూసేశాం. ఇలాంటివి సినిమాల్లోనే కానీ వాస్తవ జీవితంలో సాధ్యమా? అని కొట్టిపారేశారు.
అయితే.. ఆ సినిమాలో మాదిరి కాకున్నా.. ఒక యువ మహిళకు దేశంలోని ఒక రాష్ట్రానికి ఒక రోజు ముఖ్యమంత్రిగా వ్యవహరించే అవకాశం లభించింది. ప్రజలు ఓటు వేయకుండా.. రాజకీయ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఆమెకు ఈ అవకాశం లభించటం విశేషం. వినేందుకు సినిమాటిక్ గా అనిపించినా.. ఒక మంచి ఉద్దేశంతో ఒక రోజు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతల్ని స్వీకరించనున్న ఆ అమ్మాయి మరెవరో కాదు.. శ్రిస్తీ గోస్వామి.
రూర్కీలో బీఎస్ఎం పీజీ కాలేజీలో బీఎస్పీ అగ్రికల్చర్ సెవెన్త్ సెమిస్టర్ చదువుతున్న ఈ విద్యార్థినికి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి ఒక రోజు సీఎంగా వ్యవహరించనున్నారు. ఈ రోజు (జనవరి 24, ఆదివారం) జాతీయ బాలికా దినోత్సవం కావటంతో ఆమెను ఒకరోజు ముఖ్యమంత్రిగా బాధ్యతల్ని కట్టబెట్టనున్నారు. ఇంతకీ రాష్ట్రంలో అంతమంది ఉంటే.. శ్రిస్తీ గోస్వామికే ఒక రోజు ముఖ్యమంత్రి బాధ్యతల్ని ఎందుకు కట్టబెట్టారు? అన్న ప్రశ్న వేసుకుంటే దానికో కారణం లేకపోలేదు. ఎందుకంటే ఆమె.. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక పథకాలకు పని చేస్తున్నారు.
అంతేకాదు.. అంతర్జాతీయ బాలికా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో అంటే.. 2018 మేలో కూడా ఉత్తరాఖండ్ బాల్ విధాన సభకు కూడా ఒకరోజుసీఎంగా పని చేసిన అనుభవం ఉంది. అయితే.. ఒకరోజు ముఖ్యమంత్రిగా వ్యవహరించే శ్రిస్తీ.. సీరియస్ నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలు.. అవెలా ఉన్నాయన్న విషయాల్ని మాత్రమే రివ్యూ చేసే అవకాశం ఉంది. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేశారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. వివిధ శాఖల అధికారులు.. తమ ప్రణాళికల్ని ఐదేసి నిమిషాల పాటు వివరిస్తారు. ఈ కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య జరగనుంది. శ్రిస్తీ గోస్వామి తండ్రి రూర్కీలో బీఎస్సీ అగ్రికల్చర్ చదివి ఊళ్లో వ్యాపారం చేస్తున్నారు. తల్లి అంగన్ వాడీ కార్యకర్త.
తన కుమార్తెకు ఇలాంటి అవకాశం దక్కటంపై వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక..ఒకరోజు సీఎంగా వ్యవహరించనున్న శ్రిస్తీ తల్లి స్పందిస్తూ.. అమ్మాయిలు ఏదైనా సాధించగలరు.. వారికి తగిన తోడ్పాటు.. సాయం అందిస్తే చాలు.. వారు ఎవరికీ తక్కువేం కాదన్న విషయాన్ని నిరూపిస్తారన్నారు. ఒక శ్రిస్తీ గోస్వామి ఒక ప్రకటనలో తనకు లభించిన అవకాశంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. అధికారులు తమ ప్రజంటేషన్లు అందించిన తర్వాత.. తాను తగిన సలహాలు.. సూచనలు చేస్తానని పేర్కొన్నారు. మరి.. ఆమెకు ఆల్ ద బెస్టు చెబుదామా?