అస్సాం మహిళా పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్, లేడీ సింగంగా గుర్తింపు పొందిన జున్మణి రాభా(30) అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె ప్రయాణిస్తున్న కారును తెల్లవారుజామున లారీ ఢీకొన్న ఘటనలో ఆమె మరణించారు. అయితే ఆమె ఒంటిపై ఉన్న గాయాలు ప్రమాదం వల్ల జరిగినట్టు లేవని.. ఎక్కడో ఆమెను బాగా కొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని రాభా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాభా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయమై పలు సందేహాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు ఆ రాష్ట్ర డీజీపీ జీపీ సింగ్ వెల్లడించారు. ఇప్పటివరకూ ఈ కేసును అస్సాం సీఐడీ విభాగం దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
కాగా అస్సాంకు చెందిన మహిళా పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్, లేడీ సింగంగా గుర్తింపు పొందిన జున్మణి రాభా మృతి పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఆ సందేహాలను బలపరిచేలా ఇప్పటికే ఓ ఆడియో, వీడియో క్లిప్ వైరల్ అయ్యాయి. ఇక వైద్యులు ఇచ్చిన పోస్ట్‌మార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ముందస్తు పథకం ప్రకారమే ఆమెను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వైద్యుల పోస్టుమార్టం నివేదికలో జున్మణి రాభా శరీరంపై పలు చోట్ల, తల వెనక భాగంలో గాయాలున్నాయని వెల్లడైంది. ప్రమాదం తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించగా.. అది పూర్తిగా బిగుసుకుపోయిన స్థితిలో ఉంది. సాధారణంగా ఒక మనిషి చనిపోయిన కొన్ని గంటల తర్వాత మాత్రమే శరీరం అలా మారుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఘటనాస్థలం నుంచి వెలుగులోకి వచ్చిన ఫొటోల్లో ప్రమాదం సమయంలోనే మహిళా ఇన్‌స్పెక్టర్ శరీరం బిగుసుకుపోయిందని అంటున్నారు. జున్మణి రాభా కాళ్లూ, చేతులు వాటి జాయింట్స్ వద్ద గాయాలు, నుదురు ఎడమవైపు భాగంలో లోతుగా గాయం, తల వెనకవైపు విరిగిపోయిన ఎముక. ఛాతి, పొత్తికడుపు మధ్యభాగంలో ఎర్రగా కందిపోయిన గాయాలున్నాయని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.
తీవ్ర రక్తస్రావం, షాక్ వల్ల గుండె, శ్వాస వ్యవస్థల వైఫల్యంతో మరణం సంభవించిందని వైద్యులు పోస్టుమార్టం నివేదికలో తెలిపారు. వాటికి పొత్తికడుపు, మెదుడులో గాయాలు తోడయ్యాయి వెల్లడించారు.
కాగా ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన ఘటన కావడానికి ఎక్కువ అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. గాయాలు లారీ ఢీకొట్టడం వల్ల జరిగినట్టు లేవని అభిప్రాయపడుతున్నారు.
అందులోనూ ప్రమాదం జరిగినప్పుడు ఆమె కారు ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకొని ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఛాతి, పొత్తికడుపు వద్ద గాయాల తీవ్రత తక్కువగా ఉంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
కాగా 'లేడీ సింగం'.. 'దబంగ్ కాప్' గా మహిళా ఎస్‌ఐ జున్మణి రాభా (30) పేరు తెచ్చుకున్నారు. మే 16న ఈమె ప్రయాణిస్తున్న ప్రైవేటు కారును నగావ్ జిల్లా పరిధి జఖలాబంధా పోలీస్‌స్టేషను పరిధిలో ఓ కంటైనర్ ట్రక్కు ఢీకొంది. కాగా ఈ ప్రమాదానికి కొన్నిగంటల ముందే జున్మణిపై దోపిడీ కేసు నమోదు కావడం గమనార్హం. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె ఎటువంటి సెక్యూరిటీ, యూనిఫాం లేకుండా ప్రైవేటు కారులో ఒంటరిగా వెళ్తుండటం గమనార్హం.
కాగా ఈ రోడ్డు ప్రమాదం వెనక ఒక నకిలీ బంగారం సిండికేట్ హస్తం ఉందని, ఆ సిండికేట్ వ్యక్తుల్ని రక్షించేందుకు పోలీసు విభాగానికి చెందిన కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సాక్ష్యాలు మాయం చేసే ప్రయత్నంలో వారే సిండికేట్ కు సహకరించారని.. సిండికేట్ వ్యక్తులే ఆమెను హత్య చేసి ఉంటారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.