షాక్‌: పోలీస్ ఎస్సై ఎంత ప‌నిచేశాడంటే

Update: 2017-10-20 10:19 GMT

ఆయ‌న చ‌ట్టాన్ని ర‌క్షించాల్సిన పోలీసు అధికారి. ప్ర‌జ‌ల‌కు - ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన స‌బ్ ఇన్ స్పెక్ట‌ర్‌. అయినా.. బుద్ది పెడ‌దోవ ప‌ట్టింది. తాను ఉన్న‌ది ఉన్న‌త స్థాయి పోలీసు ఉద్యోగం అని కూడా మ‌రిచిపోయి.. చీప్‌ గా వ్య‌వ‌హ‌రించాడు. ఇప్పుడు పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నాడు. విష‌యంలోకి వెళ్తే.. క‌ర్నూలు జిల్లా ఊటుకూరు గ్రామ స‌ర్పంచ్‌ గా ప‌ద్మ‌జ అనే మ‌హిళ ఉన్నారు. ఈమె వివాహిత‌. అయితే, ప‌లు కేసుల ప‌రిష్కారం నిమిత్తం ఈమె ఇదే జిల్లాలోని సైదాపురం పోలీస్ స్టేష‌న్‌ కు వెళ్లింది. ఆయా కేసుల విష‌యంపై ఎస్సై ఏడుకొండ‌లుతో మాట్లాడేది.

అయితే, ప‌ద్మ‌జ‌పై క‌న్నేసిన ఆ ఎస్సై.. ఆమెను ఏదో ఒక ర‌కంగా లొంగ‌దీసుకోవాల‌ని భావించాడు.  నాలుగు నెలలుగా ఆమెను సెల్ ఫోన్ ద్వారా అసభ్యకర పదజాలంతో మెసేజ్‌ లు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో దీపావళి సందర్భంగా వూటుకూరు వచ్చిన ఏడుకొండలు - పద్మజ నివాసానికి వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచారయత్నానికి పాల్ప‌డ్డాడు.  దీంతో తీవ్ర‌ భయబ్రాంతులకు గురైన పద్మజ అతని బారి నుంచి తప్పించుకుని, ఇరుగుపొరుగు మహిళల సాయంతో పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.

దీంతో ఆయనపై ఎస్పీ విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన మహిళా సంఘాలు ప్రజాప్రతినిధులకే రక్షణ లేకపోతే - సామాన్య ప్రజలకు రక్షణ ఎలా ఉంటుందని - తక్షణం ఎస్సై ఏడుకొండలును విధుల నుంచి తప్పించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.  కాగా, ఇటీవ‌ల రంప‌చోడవ‌రం డీఎస్పీ స్థాయిలో ఉన్న ర‌విబాబు కూడా ఇలానే ఎంపీపీతో వివాహేత‌ర సంబంధం పెట్టుకుని హ‌త్య చేయించిన విష‌యం వెలుగు లోకి వ‌చ్చిన విష‌యం మ‌రిచిపోక‌ముందే ఇలా మ‌రో ఎస్సై ఇలా స‌ర్పంచ్ మీదే అత్యాచారయ‌త్నం చేయ‌డం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. మ‌రి డీజీపీ సాంబ‌శివ‌రావు వీరిని ఎలా స‌మ‌ర్ధిస్తారో చూడాలి.
Tags:    

Similar News