క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పే పోలీసుశాఖలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గతంలో ఎప్పుడూ ఎదురుకాని ఈ ఉదంతం పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్ గా మారటమే కాదు సంచలనంగా మారింది. తన దగ్గర శిక్షణ పొందుతున్న ట్రైనీ ఎస్ఐపై కన్నేసిన ఎస్ఐ.. తనిఖీలు చేయాలన్న పేరుతో తన వెంట తీసుకెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడిన వైనం షాకింగ్ గా మారింది. తీవ్ర కలకలానికి కారణమైన ఈ ఉదంతంలోకి వెళితే..
భూపాలపల్లికి చెందిన దళిత యువతి ఒకరు 2020లో ఎస్ఐగా ఎంపికై శిక్షణ పొందుతున్నారు. ఆమెను ఇటీవల మరిపెడ పోలీస్ స్టేషన్ లో ప్రొబెషనరీ ఎస్ఐగా నియమించారు. వివాహం కాని ఆమె పోలీస్ స్టేషన్ కు దగ్గర్లోనే ఒక రూం తీసుకొని ఉంటున్నారు. ఇదిలా ఉంటే సోమవారం రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో ఆమెకు ఫోన్ చేసిన ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి.. నల్లబెల్లం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం వచ్చిందని.. తనిఖీలు చేయాల్సి ఉంటుందన్నారు. తనతో రావాలని హుకుం చేయటంతో డ్యూటీలో భాగంగా మరో మాట మాట్లాడకుండా ఆయనతో పాటు కలిసి బయలుదేరింది.
ఇందుకు డిపార్ట్ మెంట్ వెహికిల్ కాకుండా తన ప్రైవేటు వెహికిల్ ను వినియోగించారు. కాస్తంత దూరం వెళ్లాక ఆమెతో అసభ్యంగా ప్రవర్తించటం మొదలు పెట్టారు. ఆమె అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. తన పశుబలంతో ఆమెపై అత్యాచారానికి యత్నించాడ.ఈ క్రమంలో ఆమె ముఖం మీదా.. ఇతర శరీర భాగాల మీదా గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని పై అధికారులకు చెబితే సస్పెండ్ చేస్తానని చెప్పి బెదిరించాడు. తనకు ఎదురైన దారుణ పరిస్థితి గురించి ఆ ట్రైనీ ఎస్ఐ.. తన ఇంట్లోని వారికి చెప్పింది. దీంతో వారి సూచన మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషిని కలిసి.. తనకు ఎదురైన పరిస్థితి గురించి చెప్పి.. లిఖిత పూర్వకంగా కంప్లైంట్ చేసింది.
తనకు న్యాయం చేయాలని లేదంటే తాను ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చెప్పింది. దీంతో స్పందించిన తరుణ్ జోషి.. పోలీస్.. ఇంటెలిజెన్స్.. ఎస్ బీ అధికారుల్ని రంగంలోకి దింపారు. కేసు విచారణ అధికారిగా తొర్రూరు డీఎస్పీని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డిని నియమించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసిన వారు.. ప్రాథమిక దర్యాప్తు నివేదికను ఉన్నతాధికారులకు ఇచ్చారు. వెంటనే.. ఎస్పీ ఆదేశాలతో ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అనంతరం అతడ్ని సస్పెండ్ చేసినట్లుగా పేర్కొంటూ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఇదిలా ఉంటే.. దళిత మహిళా ట్రైనీ ఎస్ఐపై లైంగిక వేధింపుల్ని నిరసిస్తూ పలువురు నిరసనలు చేపట్టటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.