అతిగా జిమ్.. పునీత్ లాగానే మరో స్టార్ మరణం

Update: 2022-11-11 16:36 GMT
ఇప్పటికే జిమ్ చేస్తూ సడెన్ హార్ట్ ఎటాక్ తో మరణించిన కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్  ఎంత విషాదం నింపిందో అందరికీ తెలిసిందే. అది మరవకముందే మరో స్టార్ కూడా బలయ్యారు. బుల్లితెర సూపర్ స్టార్ సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ మరణం మరింతగా కృంగతీసింది. తాజాగా ఆయన మరణించడంతో అంతటా విషాదం నెలకొంది.

సిద్ధాంత్ వీర్ సూర్యవంశీకి కేవలం 46 సంవత్సరాలు మాత్రమే. ఆయనకు భార్య అలీసా రౌత్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జిమ్ చేస్తూ గుండెపోటుకు గురయ్యారు. సిద్ధాంత్ వీర్ సూర్యవంశీని వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు.

టీవీ నటుడు దిపేష్ భాన్, స్టాండప్ కమెడియన్ బాలీవుడ్ నటుడు రాజు శ్రీవాస్తవ్  ఈ మధ్యకాలంలో మరణించారు. ఇప్పుడు తాజాగా సిద్ధాంత వీర్ కూడా మరణించడంతో టీవీ ఇండస్ట్రీలో శోకసంద్రంలో మునిగింది.

సిద్ధాంత్ వీర్ మృతిపట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, మాజీ క్రికెటర్ సలీల్ అంకోలా ఈ విషాదకర ఘటన పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ తరం నటులందరూ కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. దేహ ధారుడ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. హైపర్ జిమ్ వల్ల విలువైన ప్రాణాలను కోల్పోవద్దని పేర్కొన్నారు.

బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ నిర్మించిన కుసుమ్ సీరియల్ తో సిద్ధాంత్ వీర్ బుల్లితెరకు పరిచయం అయ్యాడు. పలు సూపర్ హిట్ సీరియళ్లలో నటించాడు. కృష్ణ అర్జున్, కసౌటి జిందగీకీ, జమీన్ సే ఆస్మాన్ తక్, భాగ్య విధాత, మమత, ఖయామత్, క్యాదిల్ మే హై, గృహస్తి, వంటి మెగా సూపర్ హిట్ సీరియళ్లతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News