ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లో మరోసారి హ్యాకింగ్ కు గురి కావడం అందరిని ఆందోళనకి గురిచేసింది. అయితే, అతిపెద్ద డేటా బ్రీచ్ గా చెబుతున్న తాజా కేసులో ఏకంగా ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ఫోన్ నంబర్ కూడా లీక్ కావడం గమనార్హం. మార్క్ జుకర్ బర్గ్ సిగ్నల్ యాప్ ను వినియోగిస్తున్నారనీ, ఆయన ఫోన్ నంబర్ లీక్ అయిందని భద్రతా పరిశోధకుడు వెల్లడించారు. అలాగే 533 మిలియన్ల ఫేస్ బుక్ వినియోగుదారుల వ్యక్తిగత వివరాలు లీకైనట్టు తెలిపారు. ఈ 533 మిలియన్ల మందిలో 60లక్షలమంది భారతీయ వినియోగదారులున్నారు.
అమెరికాకు చెందిన వారు 32 మిలియన్లు, 11 మిలియన్ల యూజర్లు యూకేకు చెందినవారున్నారు. ఈ ఫోన్ నంబర్ల డేటాబేస్ హ్యాకర్ల ఫోరమ్ లో పోస్ట్ చేసినట్టు నివేదించిన సంగతి తెలిసిందే. డేటా లీక్కు ప్రభావితమైన వారిలో ఫేస్ బుక్ సహ వ్యవస్థాపకులు డస్టిన్ మోస్కోవిట్జ్ , క్రిస్ హ్యూస్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. భద్రతా నిపుణుడు డేవ్ వాకర్ అందించిన సమాచారం ప్రకారం జుకర్ పేరు, పుట్టిన తేదీ, వివాహం, ఫేస్ బుక్ యూజర్ ఐడీ తదితర వివరాలన్నీ లీక్ అయ్యాయి. అలాగే జుకర్ బర్గ్ లీకైన ఫోన్ నంబర్ స్క్రీన్ షాట్ తో పాటు మార్క్ జుకర్ బర్గ్ సిగ్నల్ లో ఖాతా ఉందంటూ ట్విట్ చేశారు. మరొక భద్రతా నిపుణుడు అలోన్ గాల్ ప్రకారం, ఫేస్ బుక్ ఖాతాకు లింక్ చేయబడిన ఫోన్ నెంబర్ల ద్వారా ఈ హ్యాకింగ్ గత జనవరిలోనే జరిగిందన్నారు. దీనిపై స్పందించిన ఫేస్ బుక్ ఇదంతా పాత డేటా అని కొట్టిపారేసింది. 2019 ఆగస్టులో ఈ లోపాన్ని సరిదిద్దామని తెలిపింది.