హైదరాబాద్ లో రోడ్డు దాటుతోన్న సిగ్నల్ ..పిక్ వైరల్ , అసలు నిజం ఇదే !

Update: 2020-10-17 13:30 GMT
ఈ వారం మొదట్లో వాయిగుండం ఏర్పడటం వల్ల తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం వర్షం దెబ్బకి వణికిపోయింది. సిటీ సముద్రాన్ని తలపించింది. ఎటు చూసినా నీళ్లే. లోతట్టు ప్రాంతంలోని ఇళ్లలకు వర్షపునీరు చేరడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో 10 అడుగుల మేర ఎత్తులో వరద నీళ్లు పరాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు కొంతమంది నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి విగతా జీవులుగా మారారు. ఈ క్రమంలో నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్న దృశ్యాలు, వరద నీళ్లలో కార్లు ఇతర వాహనాలు కొట్టుకుపోతున్న వీడియోలు అనేకం , సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

ఈ క్రమంలోనే హైదరాబాద్ లో వచ్చిన వరదలకు ఒకచోట ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ కూడా కొట్టుకుపోతున్నట్లు ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది.ఎప్పుడు మనం సిగ్నల్ దగ్గర రోడ్డు దాటేవాళ్లం , కానీ చరిత్రలో మొట్టమొదటిసారి ఓ ట్రాఫిక్ సిగ్నల్ రోడ్డు దాటడం చూస్తున్నాను ఓ నెటిజన్ ఆ వీడియోను షేర్‌ చేశారు. ఈ ఫన్నీ వీడియో నెటిజన్లను ఆకర్షించడంతో నిజమేనని నమ్మి అనేకమంది విభిన్న పేస్ బుక్ , ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా పలు ప్లాట్‌ ఫామ్స్ ‌లో పోస్టు చేస్తున్నారు. అయితే హైదరాబాద్‌లో వరద నీటికి నిజంగానే ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ కొట్టుకుపోయిందా ? లేక అది ఫేక్ వీడియో అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అయితే , తాజాగా ఈ వీడియో గురించి ఇండియా టుడే యాంటీ ఫేక్‌ న్యూస్‌ వార్‌ రూమ్‌ క్లారిటీ ఇచ్చింది. ఇది హైదరాబాద్ ‌లోది కాదని రెండేళ్ల క్రితం చైనాలో యులిన్‌ నగరానికి చెందినదని తేల్చేసింది. వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే షాపుల్లో సైన్‌ బోర్డులు, బైక్‌ వెనకాల ఉన్న స్టికర్‌పై చైనీస్‌ భాష ఉందని వీటన్నింటిని ఆధారాలుగా చూపించింది. ఇన్విడ్ టూల్‌ను ఉపయోగించి, రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను ఉపయోగించి దీనికి చెందిన అసలైన వీడియోను మే 11, 2018 న చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్‌వర్క్ యూట్యూబ్ ఛానెల్ అప్‌లోడ్ చేసినట్లు బయటపెట్టారు. మొత్తంగా రోడ్డు దాటుతున్న సిగ్నల్ వీడియో హైదరాబాద్ లో తీసినది కాదు అని తేలింది.
Tags:    

Similar News