స‌హ‌న యాత్ర‌కు అస‌హ‌న ఆందోళ‌న షాక్‌!

Update: 2015-11-03 14:32 GMT
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రోడ్డు మీద‌కు వ‌చ్చారు. ఆమె కాదు.. త‌న‌తో పాటు యువ‌రాజు లాంటి రాహుల్ ను.. ప‌దేళ్ల పాటు దేశాన్ని ఏలి.. దేశం ఎంత‌గా ఊగిపోతున్న ఏ మాత్రం పెద‌వి విప్ప‌క మౌన‌ప్ర‌ధానిగా పేరొందిన మ‌న్మోహ‌న్ మొద‌లు.. కాంగ్రెస్ పార్టీకి చెందిన అతిర‌ధ మ‌హార‌థులంతా రోడ్ల మీద‌కు వ‌చ్చారు. దేశంలో పెరుగుతున్న అస‌హ‌నంపై క‌న్నెర్ర చేస్తూ.. కేంద్రం తీరును త‌ప్పు ప‌డుతూ కాంగ్రెస్ పార్టీ స‌హ‌న యాత్ర‌ను చేప్ట‌టింది.

ఈ యాత్ర‌కు పార్టీ ముఖ్య‌నేత‌లు రోడ్ల మీద‌కు రావ‌టంతో.. కార్య‌క‌ర్త‌లు కూడా భారీ సంఖ్య‌లో పాల్గొన్నారు. పార్ల‌మెంటు భ‌వ‌న్ నుంచి మొద‌లైన ఈ స‌హ‌న యాత్ర రాష్ట్రప‌తి భ‌వ‌న్ వ‌ర‌కూ సాగింది. రాష్ట్రప‌తిని క‌లిసి..దేశంలో నెల‌కొన్ని ప‌రిస్థితుల‌పై చ‌ట్ట‌ప్ర‌కారం తీసుకోవాల్సిన చ‌ర్య‌ల గురించి ప్ర‌స్తావించారు.

స‌హ‌న యాత్ర చేప‌ట్టిన కాంగ్రెస్‌ కు అస‌హ‌నాన్ని క‌లిగిస్తూ.. కాంగ్రెస్‌ కు పోటీగా సిక్కు నేత‌లు భారీగా ఆందోళ‌న చేప‌ట్టారు. సిక్కుల ఊచ‌కోత‌పై వారు నిర‌స‌న తెలుపుతూ రోడ్ల మీద‌కు వ‌చ్చారు. అయితే.. వీరిని అడ్డుకున్న పోలీసులు కాంగ్రెస్ పార్టీ స‌హ‌న యాత్ర‌ను ప్ర‌శాంతంగా సాగేట‌ట్లు చేశారు. పెద్ద ఎత్తున రోడ్డు మీద‌కు వ‌చ్చిన సోనియా ప‌రివారానికి..సిక్కుల నుంచి ఎదురైన నిర‌స‌న కొద్దిపాటి షాక్ త‌గిలిన‌ట్లే.
Tags:    

Similar News