పద్ధతిగా తెల్లటి చీరకట్టుకుంది. అధికారిణిలా బిల్డప్ ఇచ్చింది. ఏకంగా ప్రభుత్వాఫీసులకు వెళ్లి తనిఖీలు చేసింది. తాను జేసీ నంటూ హల్ చల్ చేసింది. అనంతపురంలో ఓ యువతి చేసిన పనికి స్థానిక ప్రజలే కాదు.. అధికారులు కూడా ఖంగుతిన్నారు.
ఖరీదైన చీర కట్టుకొని.. ఆఫీసర్ నంటూ సచివాలయానికి ఎంట్రీ ఇచ్చి ఫోజులు కొట్టింది. అధికారుల కుర్చీలను తనిఖీ చేసింది. కానీ పోలీసుల ఎంట్రీతో ఈ యువతి బండారం బయటపడింది.
అనంతపురం జిల్లాకు చెందిన సింధూరి అనే యువతి డిగ్రీ చదువుతోంది. బుద్దిగా చదువుకోవాల్సిన ఆమెకి చెడుబుద్ది పుట్టింది. అధికారినంటూ ఏకంగా ప్రభుత్వ ఆఫీసులనే తనిఖీలు చేయడం మొదలుపెట్టింది.
ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకున్న సింధూరి అనంతరం జాయింట్ కలెక్టర్ లాగా ఫోజులు కొట్టింది. శెట్టూరు సచివాలయం, ప్రభుత్వాసుపత్రికి వెళ్లి ఏకంగా తనిఖీలు చేసింది. నిఖీల పేరుతో సిబ్బందిని హడలెత్తించింది. రికార్డులను తనిఖీ చేస్తూ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది.
యువతి ఓవర్ యాక్షన్ పై పీహెచ్ సీ సిబ్బందికి అనుమానం కలిగింది.వెంటనే వారు తహసీల్దార్, పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు నకిలీ జాయింట్ కలెక్టర్ గా తేల్చారు.
యువతిని బత్తులపల్లి మండలం గంటాపురానికి చెందిన సింధూరిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. డిగ్రీ చదువుతున్న సిందూరి ఫేక్ జేసీగా ఎందుకు వ్యవహరించిందన్న దానిపై విచారణలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.