అమెరికా పెద్ద తోపు దేశం ఏం కాద‌ట‌!

Update: 2016-09-23 13:31 GMT
ల్యాండ్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్‌...అవ‌కాశాల ఖ‌ని - టెక్నాల‌జీ దిగ్గ‌జం. అద్భుత జీవ‌న ప్ర‌పంచం....అమెరికా పేరు చెప్ప‌క‌పోయినా ఈ విశేష‌ణ‌లు చెప్తే చాలు ప్ర‌స్తావించేది అమెరికా అని అర్థం అవుతుంది. టూరిజం గురించి కాస్తో కూడా అవ‌గాహ‌న ఉన్న‌వారు ప్ర‌పంచంలో ఒక్క‌సారైనా వెళ్లాలి - వీలైతే అక్క‌డే సెటిల్ అవ్వాలి అనుకునే అమెరికా అంత పెద్ద గొప్ప దేశం ఏం కాద‌ని తాజాగా ఓ స‌ర్వే తేల్చింది. ఇప్ప‌టికే సంతోష‌క‌ర‌మైన జీవన శైలి క‌లిగి ఉన్న దేశాల జాబితాలో టాప్‌లో నిల‌వ‌ని అమెరికా తాజాగా ఆరోగ్యం - జీవన సదుపాయాలు తదితర అంశాల్లో ఓ సంస్థ నిర్వ‌హించిన‌ అధ్యయనంలో టాప్‌10లో కాదు క‌దా...టాప్ 20లో కూడా నిల‌వ‌లేదు. ఏకంగా 28వ స్థానంతో కాస్త గౌర‌వం ద‌క్కించుకుంది.ఇందులో ఐస్లాండ్‌ మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో సింగపూర్‌ - మూడోస్థానంలో స్వీడన్‌ ఉన్నాయి.

లాన్సెట్‌ జర్నల్ అనే సంస్థ  ప్రపంచ వ్యాప్తంగా 124 దేశాల్లో ప్రజల ఆరోగ్యం విషయంలో ఐక్యరాజ్యసమితి స్థిర అభివృద్ధి లక్ష్యాల ఆధారంగా పేదరికం - శుభ్రమైన నీరు - విద్య - సామాజిక అసమానతలు - పరిశ్రమల స్థాపన తదితర 33 అంశాలపై ఇటీవల అధ్యయనం చేపట్టింది.  ఆత్మహత్యలు - వ్యాధులు - రోడ్డు ప్రమాదాలు - కాలుష్యం - ఆందోళనకర పరిస్థితులు తదితర అంశాలను కూడా ఈ అధ్యయనంలో చేర్చి జాబితాను రూపొందించారు. 1,870 పరిశోధకులతో ఈ అంశాలపై అధ్యయనం చేసింది. ఇందులో అమెరికా 28వ స్థానం ద‌క్కించుకుంది. తుపాకీ సంస్కృతి - ఘర్షణలు - మాదకద్రవ్యాల వినియోగం ఈ దేశంలో రోజురోజుకీ పెరిగిపోతుండటంతో గొప్ప దేశాల జాబితాలో వెనుకబడిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా కంటే ముందే...జర్మనీ - ఇటలీ - ఫ్రాన్స్‌ - జపాన్‌ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా మొదటి పది స్థానాల్లో చోటు దక్కించుకోలేకపోయాయి. ఇదిలాఉండ‌గా కొన్ని పాయింట్ల‌లో అమెరికా మెరుగైన ప‌నితీరు క‌న‌బ‌ర్చింది. ప‌రిశుభ్రత - నీరు - చిన్నారుల అభివృద్ధి అంశాల్లో అమెరికాకు మెరుగైన మార్కులు ద‌క్కాయి.
Tags:    

Similar News