గోదావరి పుష్కరాలకు దేశవిదేశాల నుంచి భక్తులొస్తున్నారు.. ఎక్కడెక్కడో ఉన్న ప్రముఖులూ వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఏపీ కొత్త రాజధాని నిర్మాణంలో పాలుపంచుకుంటున్న సింగపూర్ దేశ ప్రముఖులకూ పుష్కరాల ఆహ్వానం అందింది. దాంతో వారు కూడా గోదారి స్నానానికి వస్తున్నారు.
సింగపూర్ మంత్రి ఈశ్వరన్ బృందం ఈ నెల 20 రాజమండ్రిలో పుష్కర స్నానం చేయనుంది. 19వ తేదీన హైదరాబాద్ వచ్చే ఈ బృందం అక్కడ నుంచి 20న విమానంలో మధురపూడి వస్తుంది. ఏపీ రాజధాని అమరావతిలో సీడ్ కేపిటల్ కు చెందిన ప్లానును కూడా సింగపూర్ బృందం రాజమండ్రిలోనే చంద్రబాబుకు అందిస్తుంది. అదేరోజు రాజమండ్రిలో రాజధాని అమరావతిపై జరిగే సెమినార్ లో ఈ బృందం పాల్గొంటుంది. ఆ తరువాత పుష్కర స్నానం చేస్తుంది. పుష్కరాలు పూర్తయ్యే వరకూ చంద్రబాబు రాజమండ్రి నుంచే పాలన సాగించనుండడంతో సింగపూర్ బృందం రాజధాని సంబంధించిన చర్చలన్నీ రాజమండ్రిలోనే జరపనుంది.
కాగా ఏపీ కొత్త రాజధానిని అత్యాధునికంగా నిర్మించడమే కాకుండా తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను కూడా నిలిపి ఉంచేలా నిర్మించాలన్నది చంద్రబాబు ప్రణాళిక... మాస్టర్ ప్లాను రూపశిల్పులైన సింగపూర్ బృందానికి కూడా ఆ విషయం చెప్పారు. ఇప్పుడు గోదావరి పుష్కరాలకు సింగపూర్ బృందం వస్తుండడంతో ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలు, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం వారు అర్థం చేసుకునే వీలుంటుందని భావిస్తున్నారు.