ఓ సాధారణ చిత్రంగా విడుదలై ప్రేక్షకుల మదిని కన్నీటితో బరువెక్కించిన మధుర కావ్యం సీతారామం. సీతా, రామ్‌గా మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ చెప్పిన ప్రతి మాటా.. పలికించిన ప్రతి భావం ఆడియన్స్ మదిని దోచింది. అయితే ఈ సినిమా కథాంశం మొత్తం ఒక ఉత్తరం చుట్టూనే తిరుగుతా ఉంటుంది. హీరో దుల్కర్ రాసిన ఉత్తరాన్ని హీరోయిన్ మృణాల్ కు చేర్చడమే ఈ మూవీ స్టోరీ.
అయితే ఆ ఉత్తరం హీరోయిన్ కు చేరటానికి ఎన్నో ఏళ్ల సమయం పడుతుంది. కానీ హీరోయిన్ ఆ ఉత్తరం చదివే సమయానికి.. ఆ లెటర్ రాసిన హీరో ప్రాణాలతో ఉండడు. సరిగ్గా ఇప్పుడు ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. అయితే ఇక్కడ సీన్ రివర్స్. ఏకంగా ఈ ఉత్తరం చేరడానికి వందేళ్ల సమయం పట్టింది. దీంతో ఆ ఉత్తరం పంపిన వ్యక్తి, ఉత్తరం చేరాల్సిన వ్యక్తి ఇద్దరు లోకాన్ని విడిచారు.
అసలేం జరిగిందంటే... మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో 1916లో ఈ లేఖను క్రిస్టాబెల్ మెన్నెల్ అనే యువతి తన ఫ్రెండ్ కేటీ మార్ష్ కు పోస్ట్ చేశారు. అయితే అది వందేళ్ల తర్వాత 2021లో లండన్ లోని ఓ ఫ్లాట్ వద్ద లెటర్ బాక్స్ లో కనిపించింది. ఇది చూసిన రాయల్ మెయిల్ సిబ్బంది వందేళ్ల తర్వాత జాగ్రత్తగా ఈ ఉత్తరాన్ని డెలివరీ చేసింది. నిజానికి ఈ లేఖను అందుకోవాల్సిన వ్యక్తి భూమిపై లేరు. సంబంధిత ఫ్లాట్ లో ఉండే గ్లెన్ (27) అనే వ్యక్తి ఈ లేఖను చూసి ఆశ్చర్యపోయారు. ఆ లేఖను కొంత కాలం తన వద్ద ఉంచుకొని చివరికి హిస్టారికల్ సొసైటీకి అందించారు.
అయితే ఉత్తరం ఎందుకు అంత ఆలస్యం అన్న ప్రశ్నపై రాయల్ మెయిల్ నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు.బహుషా ఆ సమయంలో అది ఎక్కడో తప్పిపోయి తర్వాత వీరి చేతికి రావడంతో దాన్ని జాగ్రత్తగా డెలివరీ చేసి ఉండొచ్చిన భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ లేటర్ కి సంబందించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.