బీజేపీ నేతలు నోరు విప్పితే చాలు.. ఎక్కడో అక్కడ రాముడి ప్రస్తావన తీసుకురాకుండా ఉండరు. ఒకవేళ రాముడి మాటను తేకున్నా.. తమ సంభాషణ ముగిసే లోపు ఒక్కసారైనా వారి నోటి నుంచి రాముడి ముచ్చట రాక మానదు. మరి.. రాముడితోనూ.. ఆయన ఫ్యామిలీతోనూ అంతటి అనుబంధం ఉన్నప్పుడు.. రాముడి ధర్మపత్ని సీతను ఎత్తుకెళ్లింది ఎవరన్నది తెలీకుండా ఉంటుందా? ఛీ.. ఛీ.. అవేం మాటలు. మా రాముడి గురించి మాకన్నా బాగా తెలిసింది ఎవరు? ఆ మాటకు వస్తే.. ఈ డిజిటల్ యుగంలోనూ ఆ రాముడ్ని జనాలు ఇంతలా గుర్తు పెట్టుకున్నారంటే కారణం.. మేం కాదా? అన్న మాట చెప్పి అవాక్కు అయ్యేలా చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
రాముడి విషయంలో అంతలా రియాక్ట్ అయ్యే కమలనాథుల ఏలుబడిలో ఉన్న గుజరాత్ లో తాజాగా వెలుగులోకి వచ్చిన సిత్రం చూస్తే షాక్ తినాల్సిందే. మోడీ అడ్డాలాంటి గుజరాత్ లో గుజరాత్ విద్యాశాఖ కనుసన్నల్లో నడిచే గుజరాత్ బోర్డు విడుదల చేసిన 12వ తరగతి సంస్కృత పాఠ్యపుస్తకంలో రామాయణ పాఠాన్ని పెట్టారు. మోడీ అడ్డాలో.. ఆయన వారసుల ఏలుబడిలో ఉన్న రాజ్యంలో ఆ మాత్రం లేకుంటే ఎలా?
కానీ.. చిక్కంతా ఎక్కడ వచ్చిందంటే.. ఆ పాఠంలో ఉన్నది చూసి పిల్లలు సైతం బిక్క ముఖాలు వేస్తున్నారట. ఎందుకంటే.. సీతను ఎత్తుకెళ్లింది రాముడేనంటూ అందులో అచ్చేశారు. ఇంత శుద్ధ తప్పు.. అందునా రాముడ్ని పూజించే బీజేపీ నేతల ఏలుబడి ఉన్న రాష్ట్రంలో జరగటం.. అదినూ మోడీ అడ్డా కావటంతో ఇప్పుడీ వ్యవహారం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
అయితే.. ఇదంతా అనువాదం తప్పు అని.. అనువాదం చేసిన వ్యక్తి చేసిన తప్పుతో ఇలా జరిగిందని చెబుతున్నారు. ఎంత అనువాదకుడైనా.. సీతను ఎత్తుకెళ్లింది ఎవరన్న చిన్న విషయం తెలీకుండా ఉంటుందా? నిత్యం రాముడి గురించి అదే పనిగా మాట్లాడే బీజేపీ నేతలు..ముందు ఇలాంటి ముద్రరాక్షసల్ని పరిహరిస్తే బాగుంటుందని చెబుతున్నారు. మోడీ మాష్టారూ.. మన అడ్డాలో ఇలాంటివి జరగటం ఏమిటండి?