కాంగ్రెస్‌కు మోడీ అదిరిపోయే దీపావ‌ళి కానుక‌.. ఏం జ‌రిగింది.. వెరీ ఇంట్ర‌స్టింగ్‌!!

Update: 2022-10-23 13:29 GMT
కాంగ్రెస్ పార్టీ పుంజుకునేందుకు.. పేద‌ల‌కు త‌మ పార్టీ త‌ర‌ఫున సేవ‌లు అందించి.. త‌ద్వారా.. ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు ఇప్ప‌టి వ‌ర‌కు ఆ పార్టీ న‌మ్ముకున్న రెండు సంస్థ‌ల‌పై కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కొరడా ఝ‌ళిపించింది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్‌జీఎఫ్), రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ (ఆర్‌జీసీటీ) లకు విదేశాల నుంచి విరాళాలు తెచ్చుకునేందుకు కేంద్రం ఇచ్చిన లైసెన్సుల‌ను తాజాగా మోడీ స‌ర్కారు ర‌ద్దు చేసేసింది. దీంతో కాంగ్రెస్‌కు చేతులు కాళ్లు క‌ట్టేసిన‌ట్ట‌యింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

వాస్త‌వానికి ఇప్ప‌టికే నేష‌న‌ల్ హెరాల్డ్ కేసుతో కాంగ్రెస్ మాజీ అధినేత్రి.. సోనియాగాంధీ, ఆమె కుమారుడు.. ఎంపీ రాహుల్ గాంధీలకు ఊపిరి ఆడ‌డం లేదు. ఈ కేసులో ఈడీ అధికారులు.. ఇప్ప‌టికే రోజుల త‌ర‌బ‌డి వారిని విచారించారు. ప‌లు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నాయ‌కుల‌కు కూడా వారు నోటీసులు ఇచ్చి.. ఈ కేసును తార‌స్థాయికి చేర్చారు. దీనిలో ఎప్పుడు ఎవ‌రికి మూడుతుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ కేసుతోనే బిక్క‌చ‌చ్చిపోతున్న కాంగ్రెస్ పై  ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో తాటికాయ‌ను ప‌డేయ‌డం.. ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

తాజా దెబ్బ‌తో కాంగ్రెస్ కోలుకోవ‌డం.. క‌ష్ట‌మ‌నే వాద‌న కూడా వినిపిస్తుండడం గ‌మ‌నార్హం. అస‌లు ఏం జ‌రిగిందంటే.. కాంగ్రెస్ కు  చెందిన రెండు ఎన్జీఓ(స్వ‌చ్ఛంద సంస్థ‌లు)లకు కేంద్రం షాక్ ఇచ్చింది. విదేశీ విరాళాల సేకరణలో అవకతవకలు జరిగాయంటూ ఆ రెండు ఎన్జీల ఎఫ్సీఆర్ఏను అంటే.. విదేశాల నుంచి విరాళాలు సేక‌రించేందుకు వినియోగించుకునే లైసెన్సులను కేంద్ర హోం శాఖ దీపావ‌ళి ముందు రద్దు చేసింది.

సోనియా గాంధీ నేతృత్వంలో నడుస్తున్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్‌జీఎఫ్), రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ (ఆర్‌జీసీటీ) చట్టాన్ని ఉల్లంఘించాయని ఆరోపించింది. నిధుల దుర్వినియోగం, ఆదాయపు పన్ను దాఖలు చేసేటప్పుడు వివ‌రాల‌ను వక్రీకరించడం సహా, చైనా, విదేశాల నుంచి నిధులు పొందుతూ మనీలాండరింగ్కు పాల్పడుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఆ రెండు సంస్థ‌ల‌కు ఉన్న విదేశీ రుణాలు సేక‌రించే లైసెన్సుల‌ను ర‌ద్దు చేశారు.

హోం శాఖ లైసెన్సులు రద్దు చేసిన రెండు ఎన్డీఓలకు సోనియాగాంధీ ఛైర్పర్సన్‌గా ఉన్నారు. ట్రస్టీలుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ సీనియర్ నేత చిదంబరం, ప్రియాంక గాంధీ.. తదితరులు ఉన్నారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్.. 1991లో ఏర్పాటైంది. అణగారిన వర్గాలు, గ్రామీణ పేదల అవసరాలను తీర్చేంచుకు రాజీవ్ గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్ను 2002లో నెలకొల్పారు.

ఇదిలావుంటే.. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే కాంగ్రెస్ నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న భార‌త్‌ జోడో యాత్ర తెలంగాణ‌లో ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. దీనిని ర‌ద్దు చేసుకుని.. ఆయన హైద‌రాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్ర‌యం నుంచి న్యూఢిల్లీకి వెళ్లిపోయారు. ఇక‌, దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు .. కాంగ్రెస్ నాయ‌కులు.. నోరు విప్ప‌లేదు. మ‌రి ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారో చూడాలి.
Tags:    

Similar News