ఆఫ్ఘన్ లో భారతీయుల పరిస్థితేంటి..అంతమందిని కిడ్నాప్ చేశారా?

Update: 2021-08-21 11:30 GMT
ఆఫ్ఘనిస్థాన్‌ లో తాలిబన్లు భారతీయుల్ని కిడ్నాప్ చేశారనీ  వేర్వేరు దేశాలకు చెందిన వారిని బంధించగా, వారిలో భారతీయులు కూడా ఉన్నారనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఐతే, కేంద్ర ప్రభుత్వ దగ్గర అత్యంత నమ్మదగిన వ్యక్తుల సమాచారం మాత్రం దీనికి భిన్నంగా ఉంది. అసలు ఆఫ్ఘనిస్థాన్‌లో భారతీయులకు ఎలాంటి సమస్యా లేదు. అక్కడి తాలిబన్లు భారతీయుల జోలికి రాలేదు. భారతీయులకు సంబంధించి కిడ్నాప్ అనే మాటే లేదు. భారతీయులంతా క్షేమంగా ఉన్నారు. ఆప్ఘనిస్థాన్‌లోని కొందరు అధికారులు భారతీయులకు అండగా ఉన్నారు. ఇండియన్స్‌ని సేఫ్‌గా ఇండియా పంపించేందుకు వారు నిరంతరం కృషి చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, తాలిబన్లు భారతీయుల్ని ఏమీ అనట్లేదు. వాళ్లను ఆప్ఘనిస్థాన్‌లోనే ఉండమని కోరుతున్నారు.

తమ దేశాన్ని అభివృద్ధి చెయ్యమని భారతీయుల్ని కోరుతున్నారు. కానీ తాలిబన్లను నమ్మే పరిస్థితి లేకపోవడంతో , భారతీయులు అక్కడి నుంచి వీలైనంత త్వరగా ఇండియా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా  ఎయిర్ కంట్రోల్ అమెరికా చేతిలో ఉండటంతో  అమెరికాతో సంప్రదింపులు జరుపుతూ గగనతల మార్గంలో వారిని ఇండియా తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. తాలిబన్లు ప్రధానంగా టార్గెట్ చేస్తున్నది ఆప్ఘనిస్థాన్ ప్రజలనే. ఇంతకాలం అక్కడి ప్రజలు  అమెరికా సంయుక్త దళాలకు అండగా నిలిచారనే ఉద్దేశంతో  తాలిబన్లు వారిపై కక్ష గట్టారు. అమెరికాకు సహకరించిన ఎవ్వర్నీ వదిలే ప్రసక్తి లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. దాడులు చేస్తూ, కాల్పులు జరుపుతూ, తిరిగి పూర్వపు అరాచకాలన్నీ చేస్తున్నారు. ఐతే ,ఇప్పటివరకూ వారు భారతీయుల జోలికి రాలేదని తెలుస్తోంది. పైగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తాజాగా నియంత్రుత్వ పాలనలు ఎక్కువ కాలం సాగవని చెప్పడం ద్వారా పరోక్షంగా తాలిబన్లకు హెచ్చరిక చేసినట్లైంది.

తాజాగా కాబూల్‌ ఎయిర్‌ పోర్ట్‌ దగ్గర 150 మందిని తాలిబన్లు కిడ్నాప్‌ చేసినట్టు వార్తలు విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. వీరిలో ఎక్కువమంది భారతీయులు ఉన్నట్టుగా వార్తలు వెల్లడౌతున్నాయి. కాబూల్‌ నుంచి బాధితులను స్వదేశాలకు తరలించేందుకు సిద్ధమైన సమయంలో.. తాలిబన్లు ఈ చర్యకు పాల్పడినట్టుగా ప్రచారం సాగుతోంది. అయితే , మేము 150 మందిని కిడ్నాప్ చేశామనీ, అందులో ఎక్కువ మంది భారతీయులే అని వస్తున్న వార్తల్ని ఖండిస్తున్నాం అని తాలిబన్ ప్రతినిధి తెలిపారు. కాబూల్ లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్ట్ చుట్టూ మా తాలిబన్ బృంద సభ్యులు ఉన్నారు. మేము పర్మిషన్ లేకుండా ఎవర్నీ ఎయిర్‌ పోర్టులోకి పంపట్లేదు అని ఆయన తెలిపారు.

తాలిబాన్ల బందీలో ఉన్న భారతీయులు సురక్షితంగా ఉన్నారని, సాధ్యమైనంత త్వరలో భారత్ కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు చెబుతున్నారు.. ఇప్పటికే కాబూల్ విమానాశ్రయం లో భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం సిద్ధంగా ఉంది. కాబూల్ విమానాశ్రయం వద్ద సుమారు 150 మంది భారతీయతలను బందీలుగా చేసిన తాలిబాన్లు, విమానాశ్రయం నుంచి సమీపంలో ఉన్న పోలీసు స్టేషన్ కు ట్రక్కులలో తరలించినట్టుగా సమాచారం. భారతీయులకు సంబంధించిన ప్రయాణ పత్రాలు, గుర్తింపు కార్డులను పరిశీలించినట్టుగా తెలుస్తోంది. ఇంకా సుమారు 1000 మంది ఆప్ఘనిస్తాన్ లో భారతీయులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.
Tags:    

Similar News