కట్టలు తెగే కోపంతోనే కాదు.. అగ్రహం విచక్షణను చంపేస్తుంది. అనుకోని సమస్యల్ని తెచ్చి పెడుతుంది. ఈ కోపానికి మద్యం తీసుకునే అలవాటు తోడైతే.. అగ్నికి ఆజ్యం పోసినట్లే. తాజాగా ఒక భర్త పిచ్చి కోపం ఆరుగురు జీవితాన్ని బలి తీసుకుంది. షాకింగ్ గా మారిన ఈ ఉదంతం కర్ణాటకలో చోటు చేసుకుంది. ఇంటికి రమ్మంటే రానని మొండికేసిన భార్యపై కట్టలు తెగిన కోపంతో భర్త.. బావ మరిది ఇంటిని తగలబెట్టేశాడు.
ఈ ఆరాచకం కర్ణాటకలోని కొడుకు జిల్లాలోని కనూరులో జరిగింది. ఆ ఊరుకు చెందిన భోజ అనే వ్యక్తికి బేబీ అనే మహిళతో పెళ్లైంది. ఇతగాడు మద్యానికి బానిస కావటంతో బేబీకి ఇబ్బందిగా మారింది. దీనికి తోడు ఏదో పేరు చెప్పి ఆమెను వేధింపులకు గురి చేసేవాడు. దీంతో.. ఆమె భర్తను వదిలేసి తన సోదరుడి ఇంటికి వెళ్లింది.
తాజాగా భార్య ఉన్న బావమరిది ఇంటికి వెళ్లాడు. ఇంటి తిరిగి రావాలంటూ పట్టుబట్టారు. అయినప్పటికీ బేబీ మాత్రం ససేమిరా అంది. దీంతో తిరిగి వెళ్లిపోయిన బోజ.. అర్థరాత్రి దాటిన తర్వాత మళ్లీ తిరిగి వచ్చాడు. బయట తలుపులకు తాళాలు వేసి.. ఇంటి మీద పెట్రోల్ పోసి నిప్పు పెట్టి పారిపోయాడు.
అనుకోని రీతిలో విరుచుకుపడిన ఈ ఉత్పాతం నుంచి బయటపడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీనికి తోడు.. నిప్పు పెట్టిన సమయంలో మాంచి నిద్రలో ఉండటం.. ప్రమాద తీవ్రత పెరిగిన తర్వాత వారు మేల్కొన్నప్పటికి అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. దీంతో.. ఇంట్లోని వారంతా సజీవ దహనమయ్యారు.
మరణించిన ఆరుగురిలో నలుగురు చిన్నపిల్లలే ఉండటం గమనార్హం. స్థానికులు ఇచ్చిన సమచారం మేరకు ఫైరింజన్లు వచ్చినప్పటికీ.. అప్పటికే ఇల్లంతా కాలిపోవటం.. ఇంట్లోని వారంతా సజీవ దహనమైన ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఉదంతంలో గాయపడిన ఐదుగురికి మైసూర్ లో చికిత్స జరుపుతున్నారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. కేసునమోదు చేసిన పోలీసులు నిందితుడు కోసం వెతుకుతున్నారు.