జ‌య‌ల‌లిత బంగ్లాలో అస్థి పంజ‌రం!

Update: 2017-06-28 16:09 GMT
తమిళనాడులోని సిరుతాపూర్ బంగ్లా వద్ద ఒక అస్థి పంజరం కనిపించిన ఘ‌ట‌న స్థానికంగా సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. ఈ బంగ్లాను దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఒకప్పుడు తన గెస్ట్‌ హౌస్‌ గా ఉపయోగించుకున్నారు. ఆ బంగ్లాలో గస్తీ కాస్తున్న సాయుధ పోలీసులకు సోమవారం ఆ అస్థి పంజరం కనిపించింది. అవి అక్క‌డ‌ సెక్యూరిటీగా పనిచేస్తున్న వ్యక్తి అవశేషాలుగా భావిస్తున్నారు.

ఆస్తి త‌గాదాల్లో భాగంగా ఈ హత్య జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. అమ్మ చ‌నిపోయాక‌  పోయెస్‌ గార్డెన్ - సిరుతాపూర్‌ - కొడనాడు ప్రాంతాల్లో పోలీసు భద్రతను తగ్గించారు. ప్రస్తుతం సిరుదావూరు బంగ్లాలో సాయుధ పోలీసులు మాత్రమే గస్తీ కాస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు విచారణ జరుపుతున్నారు.  

ఈ బంగ్లాకు జయలలిత అప్పుడప్పుడు విడిది కోసం మాత్రం వెళ్లేవారు. ప్రస్తుతం ఈ బంగ్లా శశికళ - దినకరన్ కుటుంబీకుల అధీనంలో ఉంది.  శశికళ జైలుకు వెళ్లిన తర్వాత దినకరన్ కుటుంబ సభ్యులు అందులో ఉంటూ బంగ్లాను చూసుకుంటున్నారు. గత ఏప్రిల్‌ లో బంగ్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అప్ప‌టికి దినకరన్‌ ను పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో ప్రమాదంపై అనుమానాలు కలిగాయి. జయలలిత ఆస్తులకు సంబంధించి విలువైన పత్రాలు ఈ బంగ్లాలో ఉన్నట్టు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News