కాలం మారింది క‌మ‌ల్ సాబ్‌.. మైలేజ్ త‌ర్వాత‌.. మొద‌టికే మోసం!

Update: 2019-05-17 05:37 GMT
కాలం మారింది. ఈ విష‌యం క‌మ‌ల్ లాంటి క‌మ్యునిస్ట్ మైండ్ సెట్ ఉన్నోళ్లు గుర్తించ‌లేన‌ట్లుంది. గ‌తంలో మాదిరి హిందువుల‌ను ఉద్దేశించి ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడే నేత‌ల్ని.. ఓర్పుతోనో.. స‌హ‌నంతోనో.. అబ‌ద్ధం చెబితే నిజ‌మైపోతుందా? అన్న భావ‌న‌తోనూ చూసిచూడ‌న‌ట్లుగా ఉండే ప‌రిస్థితి. కానీ.. అలాంటి తీరుతో మొద‌టికే మోసం రావ‌టం.. ఉనికే ప్ర‌మాదంలోకి ప‌డ‌టంతో హిందువుల్లో స‌రికొత్త చైత‌న్యం వెల్లివిరిస్తోంది.

హిందూ ప‌దాన్ని బూతుగా మార్చేసే కొన్ని దుర్మార్గ‌పు రాజ‌కీయ పార్టీల పుణ్య‌మా అని.. ఆ వ‌ర్గం ఇప్పుడు అలెర్ట్ అయ్యింది. త‌మ‌ను చిన్న‌బుచ్చేలా ఎవ‌రు మాట్లాడినా క‌స్సుమంటోంది. త‌మ రాజ‌కీయ స్వార్థం కోసం చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించ‌టం..వాస్త‌వాల‌ను భిన్నంగా చెప్పే ధోర‌ణిపై చీల్చి చెండాడుతున్నారు. తాజాగా సినీ న‌టుడు క‌మ్ రాజ‌కీయ పార్టీ స్టార్ట్ చేసిన క‌మ‌ల్ హాస‌న్ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌పై దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు.. ఖండ‌న‌లు పెరుగుతున్నాయి.

గాంధీజీని హ‌త‌మార్చిన గాడ్సే తొలి హిందూ తీవ్ర‌వాదిగా చేసిన వ్యాఖ్య‌ల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. గాడ్సేను వెన‌కేసుకురావ‌టం కాదు..గాడ్సే దుర్మార్గాన్ని హిందువుల‌కు ఆపాదించ‌టంపై ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ఒక‌డు రేప్ చేస్తే.. అత‌గాడి కులం మొత్తాన్ని రేప్ చేసే దుర్మార్గులుగా.. అత‌గాడి ఊరిని రేప్ చేసే మృగాళ్ల ఊరుగా అభివ‌ర్ణిస్తే ఎలా ఉంటుందో.. క‌మ‌ల్ వ్యాఖ్య‌లు ఇంచుమించు అలానే ఉన్నాయ‌ని చెప్పాలి.

తీవ్ర‌వాదం.. ఉగ్ర‌వాదం లాంటి దుర్మార్గాల్ని ఒక వ్య‌క్తి చేసిన ప‌నికి ప‌రిమితం చేస్తే ఎవ‌రూ ఏమీ అన‌రు. కానీ.. అత‌గాడి కులం.. మ‌తం.. ప్రాంతం లాంటివాటితో జోడిస్తేనే ఇబ్బంది. క‌మ‌ల్ చేసిన వ్యాఖ్య‌లు కూడా ఇలాంటిదే. అది కూడా ఆయ‌న చేసిన ప్రాంతం.. ఆయ‌న నోటి నుంచి ఆ త‌ర‌హా వ్యాఖ్య‌లు రావ‌టానికి కార‌ణాల్ని చూస్తున్న వారు ర‌గిలిపోతున్నారు. ముస్లింలు అత్య‌ధికంగా ఉన్న ప్రాంతంలో క‌మ‌ల్ చేసిన హిందూ ఉగ్ర‌వాది వ్యాఖ్య‌లపై తీవ్ర ఆగ్ర‌హం పెల్లుబుకుతోంది.

త‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో గురువారం ఆయ‌న రెండు చోట్ల స‌భ‌లు నిర్వ‌హిస్తే.. రెండుచోట్ల దాడులు జ‌ర‌గ‌టం.. కోడిగుడ్లు.. చెప్పులు.. రాళ్లు విసిరేస్తూ త‌మ ఆగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఈ త‌ర‌హా దాడిని స‌మ‌ర్థించ‌టం లేదు. అలా అని క‌మ‌ల్ చేసిన దుర్మార్గ వ్యాఖ్య‌ల్ని త‌క్కువ చేసి చూడ‌లేం. క‌మ‌ల్ చేసిన వ్యాఖ్య‌ల‌పై రియాక్ట్ అయిన ప‌లువురు ఆందోళ‌నకారులు చేసిన దాడి కార‌ణంగా క‌మ‌ల్ కు స్వ‌ల్ప గాయాల‌య్యాయి. ఎక్క‌డైతే క‌మ‌ల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారో.. అక్క‌డే ఈసారి ఆయ‌న‌పై దాడి జ‌ర‌గ‌టం గ‌మ‌నార్హం.

అంతేకాదు.. క‌మ‌ల్ కార్య‌క‌ర్త‌లుగా ఇద్ద‌రిపైన ప‌లువురు దాడి చేశారు. ఇదిలా ఉండ‌గా.. త‌న వ్యాఖ్య‌ల‌పై బీజేపీ.. హిందూ మున్నాని నేత‌లు త‌మిళ‌నాడులో ఆందోళ‌న‌ల్ని ఉధృతం చేశారు. మ‌రోవైపు సులూర్ ఉప ఎన్నిక‌లో భాగంగా ప్ర‌చారం చేయాల్సిన కోయంబ‌త్తూరు జిల్లాలో స‌భ‌ను నిర్వ‌హించుకోవ‌టానికి పోలీసులు అనుమ‌తి నిరాక‌రించారు. తాజాగా చోటు చేసుకుంటున్న వ‌రుస ప‌రిణామాల నేప‌థ్యంలో క‌మ‌ల్ త‌న ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని రెండు రోజులు ర‌ద్దు చేసుకుంటూ నిర్ణ‌యం తీసుకున్నారు.

మ‌రోవైపు.. క‌మ‌ల్ చేసిన వ్యాఖ్య‌ల‌పై త‌మిళ‌నాడు వ్యాప్తంగా 70కి పైగా ఫిర్యాదులు న‌మోదయ్యాయి. ఇదిలా ఉంటే ముంద‌స్తు బెయిల్ కోసం క‌మ‌ల్ త‌ర‌ఫు న్యాయ‌వాది మ‌ద్రాసు హైకోర్టు మ‌దురై బెంచి తీర్పును వాయిదా వేశారు. క‌మ‌ల్ చేసిన వ్యాఖ్య‌ల‌పై స‌మ‌న్లు జారీ చేస్తామ‌ని.. సంజాయిషీ స‌రిగా లేకుండా అరెస్ట్ చేస్తామ‌ని ప్ర‌భుత్వం త‌ర‌ఫు న్యాయ‌వాది పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. గాంధీజీని చంపిన నాథూరాం గాడ్సేను గురించి మాత్ర‌మే క‌మ‌ల్ త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారే త‌ప్పించి.. హిందువుల‌ను కించ‌ప‌ర్చ‌లేద‌న్నారు. అదే నిజ‌మైన‌ప్పుడు.. క‌మ‌ల్ ఆ విష‌యాన్ని స్ప‌ష్టంగా వివ‌రిస్తూ.. ఏదైనా నోట్ ఎందుకు విడుద‌ల చేయ‌లేదు?
Tags:    

Similar News