నిజమే.. అబ్రహం అనే వ్యక్తి పెద్ద సెలబ్రిటీ ఏమీ కాదు. అలా అని ఉన్నత ఆదాయ వర్గానికి చెందిన వ్యక్తి కాదు. ఆ మాటకు వస్తే.. ఆయన ఉండే ఊళ్లో కూడా అందరికి సుపరిచితుడు కాదు. కానీ..వారం రోజులుగా ఆయన బ్యాంకు ఖాతా సాక్షిగా సాగుతున్న యవ్వారం చూస్తే మాత్రం దిమ్మ తిరిగిపోవాల్సిందే. కర్నూలు జిల్లా పెద్దకడబూరు గ్రామానికి చెందిన అబ్రహం అనే చిన్న రైతుకు ఆంధ్రా ప్రగతి గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది.
ఆయన బ్యాంకు ఖాతా అకౌంట్లో ఈ నెల 24నుంచి భారీగా నగదు జమ కావటం.. ఆ వెంటనే ఆ మొత్తం విత్ డ్రా కావటం జరుగుతోంది. తరచూ జరుగుతున్న ఈ వైనాన్ని తన మొబైల్ నెంబర్ (9989050379)కు వస్తున్న మెసేజ్ లను చూసి ఆయన షాక్ తింటున్నారు. కోట్లాది రూపాయిలు తన అకౌంట్లోకి వచ్చి.. ఆ వెంటనే విత్ డ్రా అవుతున్న తీరుతో బెంబేలెత్తుతున్న ఆయన.. తన ఖాతా మీద అధికారులు ఫోకస్ చేయాలని కోరుతున్నారు.
ఇప్పటివరకూ తన మొబైల్ కు 68 మెసేజ్ వచ్చాయని 30వ తేదీ ఉదయం పదకొండు గంటల వేళకు తన ఖాతాలో రూ.1.96కోట్లు జమ కాగా.. సాయంత్రం ఆరు గంటల సమయానికి రూ.1.33కోట్లు విత్ డ్రా అయినట్లుగా మెసేజ్ లు రావటంపై ఆయన తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. తన అనుమతి లేకుండా సాగుతున్న ఈ భారీ లావాదేవీలపై అధికారులు ఫోకస్ చేయాలని కోరుతున్నారు. అధికారులు కానీ.. ఈ అకౌంట్ మీద ఫోకస్ చేస్తే.. ఎన్ని సిత్రాలు బయటకు వస్తాయో? మరెంతమంది పెద్ద మనుషుల బండారం బయటపడుతుందో?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/