టిక్ టాక్ కు థాంక్స్ చెప్పిన స్మృతి ఇరానీ...ఎందుకంటే ?

Update: 2020-07-04 00:30 GMT
భారత్ -చైనా దేశాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో భారత్ లో చైనా దేశానికి చెందిన 59 యాప్ లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కాగా గతంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ టిక్ టాక్ కు థాంక్యూ చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరస్ కట్టడిలో భాగంగా టిక్ టాక్ కు ఆమె ధన్యవాదాలు చెప్పుతూ తీసిన వీడియోను సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ షేర్ చేతున్నారు. ఈ వీడియోలో స్మృతి ఇరానీ మహమ్మారి పై ఐక్యంగా పోరాడాలన్న నరేంద్రమోడీ పిలుపుకు విశేషస్పందన లభించిందన్నారు. ఈ సందర్భంగా టిక్ టాక్ పిపిఈ సూట్స్ విరాళాన్ని, భాగస్వామ్యాన్ని గుర్తుచేసి టిక్ టాక్ సీఈఓ నిఖిల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. అంతే కాకుండా ఈ వీడియో అందరికీ చేరేలా షేర్ చేయాలనీ కోరారు.

ఇక ,మరోవైపు టిక్ టాక్ ను దేశం లో నిషేదించటంతో ఆ సంస్థ చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. కానీ చైనా యాప్ తరపున వాదించడానికి భారత్ లో న్యాయవాదులు ముందుకు రాకపోవటంతో ఆ సంస్థ నిర్ణయానికి ఆదిలోనే బ్రేక్ పడింది.
Tags:    

Similar News