అశ్విన్​ బౌలింగ్​ కు వణికిపోతున్న స్మిత్​..!

Update: 2020-12-30 09:30 GMT
స్మీవ్ స్మిత్ .. ఆస్ట్రేలియాకు ఓ అద్భుతమైన బ్యాట్స్​మెన్​. అతడు క్రీజ్​లో ఉన్నాడంటే పరుగుల వరద పారాల్సిందే. అది టీ20 అయినా.. వన్డే అయినా.. టెస్ట్​ మ్యాచ్​ అయినా అన్ని ఫార్మాట్లలో అదరగొట్టగల సత్తా అతడికుంది. ఎన్నో సార్లు ఆస్ట్రేలియా టీంను స్మిత్​ గెలిపించాడు. అందుకే ఇటీవల అతడికి ఐసీసీ ‘మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద డికేడ్’ పురస్కారాన్ని ఇచ్చింది. కానీ ఇప్పుడు ఇండియాతో జరుగుతున్న టెస్ట్​మ్యాచ్ లలో స్మిత్​ రాణించలేకపోతున్నాడు.

గత నాలుగు ఇన్సింగ్స్​లలో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి రెండు సార్లు అశ్విన్​ బౌలింగ్​లోనే అవుటయ్యాడు. మెల్‌బౌర్న్ వేదికగా 8వికెట్ల తేడాతో ఆసీస్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం  1-1తో ఈ సీరిస్​ సమంగా ఉంది. అయితే మూడో టెస్టులో అయినా స్మిత్​ ఫామ్​లోకి వస్తాడేమోనని ఆస్ట్రేలియా కోరుకుంటున్నది. అయితే ఈ టెస్ట్​ సిరిస్​లో స్మిత్​ వరసగా రవిచంద్రన్​ అశ్విన్​ బౌలింగ్​లోనే అవుటవుతున్నాడు.

 ఈ నేపథ్యంలో స్మిత్​ మాట్లాడుతూ.. ‘ నిజంగా నేను అశ్విన్​ బౌలింగ్​ను తట్టుకోలేకపోతున్నా.. నా కెరీర్​ లో  ఇంత డేంజరస్​ బౌలర్​ను చూడలేదు. వచ్చే మ్యాచ్​ నుంచి అతడిని ఫేస్​ చేసేందుకు ప్రయత్నిస్తా. రివర్స్​ అటాక్​తోనే అతడిని కట్టడి చేయాలని చూస్తున్నా’ అంటూ స్మిత్​ పేర్కొన్నాడు. అశ్విన్​ బంతి రెండు వైపులా పదునుగా ఉన్న కత్తితో సమానమని పేర్కొన్నారు. ఈ విషయంపై అశ్విన్​ ఏమన్నాడంటే.. ఆస్ట్రేలియాను కట్టడి చేయాలంటే.. స్మిత్​ అవుట్​ అయ్యి తీరాలి. అందుకోసమే మేము ఓ ప్లాన్​ వేశాం. ఆ ప్లాన్​ వర్కవుట్​ అయ్యింది. దీంతో స్మిత్​ను అవుట్​ చేయగలిగాం’ అని  పేర్కొన్నాడు.
Tags:    

Similar News