పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం...పొగ త్రాగడం మీకే కాదు ..మీ పక్కనున్న వారికీ కూడా హానికరమే. ఈ వాక్యాన్ని మనం ప్రతి రోజు ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా సినిమాలలో ఈ హెడ్ లైన్ కొంచెం హై లెట్ చేసి చూపిస్తారు. కానీ , దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఎక్కడ పడితే , అక్కడ సిగరెట్లు తాగుతున్నారు. పోలీసులు ఎంతగా దీనిపై శ్రద్ద పెట్టినప్పటికీ కూడా ఇంకా చాలామంది రోడ్లపై సిగరెట్లు తాగడం మానడం లేదు. తాజాగా రోడ్డుపై సిగరెట్ తాగేవారిని ..అక్కడి స్థానికులు పోలీసుల కి పట్టించడం తో ..వారు అతన్ని కొర్టు లో హాజరు పరచగా ..కోర్టు ఆరు బయట సిగరెట్ తగిన వ్యక్తికి ఎవ్వరు ఊహించని శిక్షని విధించింది. ఆ శిక్ష ఏంటో ఇప్పుడు చూద్దాం..
భహిరంగ ప్రదేశాల లో మద్యపానం , ధూమపానం అనేది నిషేధం. ఈ విషయం తెలిసినప్పటికీ కూడా మేడిపల్లి ఎన్ఐఎన్ కాలనీ కి చెందిన బాలదీపక్ బుధవారం నైట్ ఆరు బయట హాయిగా సిగరెట్ తాగాడు. దీనితో ఆ కాలనీ వాసులు పెట్రోలింగ్ పోలీసులు కంప్లయింట్ ఇచ్చారు. దీనితో అక్కడికి వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు ఆరు బయట సిగరెట్ తాగే వ్యక్తి ని అరెస్ట్ చేసి .. ఎల్ బీనగర్ ఫస్ట్ క్లాస్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ తాగినందుకు ఆ వ్యక్తికి కోర్టు మూడు రోజుల జైలు శిక్ష విధించింది. గతంలో ఇలా ఆరుబయట దూమపానం చేసే వారికి కోర్టు రూ.50 చొప్పున ఫైన్ వేసింది. కానీ , ఈసారి ఏకంగా మూడు రోజుల జైలు శిక్షని విధించింది. బహిరంగ ప్రదేశంలో సిగరెట్ తాగిన వ్యక్తికి జైలు శిక్ష పడడం సిటీలో ఇదే మొదటిసారి కావడం విశేషం.