ప్రియాంక అంటే ఎంత తేలిక అయిపోయింది?

Update: 2017-03-11 17:04 GMT
కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌ - దివంగ‌త మాజీ ప్ర‌ధాన‌మంత్రి ఇందిరాగాంధీ పోలిక‌ల‌తో ఉండ‌టం వ‌ల్ల కావ‌చ్చు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో ఆ పార్టీకి గ‌ట్టి ప‌ట్టున్న నేప‌థ్యం అయి ఉండ‌వ‌చ్చు దేశంలో ఎక్కడా ప్ర‌చారం చేసిన చేయ‌క‌పోయినా.... కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకాగాంధీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో మాత్రం ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతారు. అది సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌యినా - రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు అయినా కాంగ్రెస్ ప్ర‌చారంలో ప్రియాంక త‌ప్ప‌కుండా ఉంటారు. అయితే తాజాగా జ‌రిగిన యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్రియాంక ప్ర‌చారం ఫ‌లితం ఇవ్వ‌లేదు. కాంగ్రెస్ పార్టీ ఇలాకాగా పేరున్న రాయ్ బ‌రేలీ - అమేథీల్లో ఆ పార్టీ కంటే బీజేపీకే ఎక్కువ‌గా ఓట్లు, సీట్లు ద‌క్కాయి. ఈ ప‌రిణామాన్ని స‌హ‌జంగానే ప్ర‌తిప‌క్ష‌మైన బీజేపీ అందిపుచ్చుకుంది. గ‌త ఎన్నిక‌ల్లో అమేథి నుంచి పోటీ చేసి రాహుల్ గాంధీ చేతిలో ఓటమి పాల‌యిన‌ కేంద్రమంత్రి స్మృతిఇరానీ ప్రియాంక‌ను ఘాటుగా విమర్శించారు.

ప్రియాంకాగాంధీ కేవలం కాగితం పులి మాత్రమేనని స్మృతిఇరానీ ఎద్దేవా చేశారు. సమాజ్‌ వాదీ-కాంగ్రెస్‌ కూటమి తరఫున ఆమె చేసిన ప్రచారం ఎటువంటి ప్రభావాన్ని చూపలేకపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ నాయకత్వం, అమిత్‌ షా కృషి వల్లే బీజేపీ విజయం సాధించిందని స్మృతిఇరానీ తెలిపారు. కులమతాలకు అతీతంగా ప్రజలు ఓట్లు వేయడంతో త‌మ పార్టీ ఘన విజయం సాధించిందని ఆమె విశ్లేషించారు. రాయ్ బరేలీలోని 6 స్థానాలకుగాను కాంగ్రెస్ 2 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. కాగా, అమేథీలోని 4 స్థానాల్లో ఒక్కచోట కూడా నెగ్గలేదు.

కాగా, ఎన్నికల ప్రచార సమయంలోను స్మృతి ఇరానీ ప్రియాంకా గాంధీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని, ప్రజలు అడిగే ప్రశ్నలకు ప్రియాంక దగ్గర సమాధానాలు లేవు కాబట్టే ఆమె అమేథిలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనలేదని విమర్శించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News