బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో కొలువు తీరింది మొదలు.. హిందూత్వం.. కాషాయూకీరణ అంటూ తరచూ రెండు పదాల్ని ప్రస్తావిస్తుంటారు. పిల్లలకు చదువు చెప్పే పుస్తకాల్ని కాషాయూకరణ చేస్తున్నారని.. చరిత్రను ధ్వంసం చేస్తున్నట్లుగా కాంగ్రెస్.. కమ్యూనిస్ట్ నేతలు తరచూ విమర్శలు చేస్తుంటారు. ఇంతకీ బీజేపీ ప్రభుత్వాలు వచ్చినప్పుడు మార్చే పాఠ్యాంశాలు ఏమిటి? అన్నది ఒక ప్రశ్న అయితే.. కమ్యూనిస్టులు.. కాంగ్రెస్ నేతలు బలంగా సమర్థించే పాఠ్యాంశాలు ఏమిటన్న విషయాన్ని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ లోక్ సభలో సాక్ష్యాలతో వెల్లడించారు.
మామూలుగా అయితే ఇలాంటి మాటలకు ఆధారాలు ఏమిటని.. వాటిని అచ్చులో తమకు చూపించాలని కమ్యూనిస్టులు వితండవాదం చేస్తుంటారు. లోక్ సభలో అధికారపక్షానికి చెందిన మంత్రి ఒకరు చెప్పిన మాటలు ప్రామాణికంగా తీసుకోవచ్చు కాబట్టి.. బుధవారం లోక్ సభలో మంత్రి స్మృతి ఇరానీ చెప్పిన మాటల్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆమె ప్రస్తావించిన పాఠాలన్నీ సోనియమ్మ నేతృత్వంలో సాగిన యూపీఏ హయాంలోనివేనన్న విషయం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదేమో.
పిల్లలకు బోధించే పాఠాల్లో ఉన్న అంశాలు చూస్తే..
‘‘నాలుగో తరగతి చరిత్ర పుస్తకం. టీచర్స్ గైడ్. దీన్ని రాసింది తీస్తా సెతల్వాద్ (ఈమె గుజరాత్ అల్లర్లకు సంబంధించి మోడీ మీద పోరాడుతున్న సామాజిక కార్యకర్త) దీన్ని ప్రవేశ పెట్టింది యూపీఏ హయాంలోని కపిల్ సిబల్. యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ’’
అందులో ఉన్నదేమిటంటే.. ‘‘ప్రాచీన భారతదేశం హిందువులకు ప్రతీకగానూ.. మధ్యయుగ భారతం ముస్లింలకు చెందినదిగానూ వలసపాలకులు చిత్రీకరించారు. మా పాఠ్య పుస్తకాలు.. సిలబస్ లోనూ ఇదే కొనసాగిస్తున్నాం’’ అని రాశారు.
‘‘సిక్కు వ్యతిరేక అల్లర్లు.. కన్యాకుమారిలో హిందువులు – క్రైస్తవుల మధ్య గొడవలు కూడా పిల్లలకు బోధించే పాఠాలేనా?’’
‘‘ఆరో తరగతి చరిత్ర పుస్తకంలో.. కశ్మీర్ నేడు మోసపోయిన.. భయకంపిత భూభాగం. భారత ప్రభుత్వ ఆరాచకాలకు వ్యతిరేకంగా ఆ రాష్ట్రం పోరాడుతుంది అని రాశారు’’ – ఇలాంటి పాఠాలు చదివి వర్సిటీలకు వచ్చి కాశ్మీర్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతాం అని నినదిస్తే ఆశ్చర్యం ఏముంటుంది?
‘‘నాలుగో తరగతి చరిత్ర పుస్తకంలోని మరో పాఠంలో ఇందిర హత్య తర్వాత పరిస్థితిపై అడిగిన ప్రశ్నకు సంబంధించి మూడు ఆప్షన్లు ఇచ్చారు. అందులో ఒకటి.. టీచర్ ను హిందువు హత్య చేశాడు’’
‘‘ఆరో తరగతి పిల్లల పాఠంలో పాకిస్థాన్ రచయితను కోట్ చేశారు. అదేమంటే.. ‘‘పాకిస్థాన్ లో అల్లా సైన్యం.. భారత్ లో హిందుత్వ నరకం’’ అని ఉంది. ఇదేనా? పిల్లలకు మనం చెప్పే పాఠాలు..?