ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏకైక పింక్ బాల్ టెస్టులో భారత మహిళల జట్టు అదరగొడుతోంది. ముఖ్యంగా భారత ఓపెనర్ స్మృతి మంధాన చూడచక్కని షాట్లతో అలరిస్తోంది. ఈ క్రమంలో ఆమె అరుదైన ఘనత సాధించింది. పింక్ బాల్ టెస్టులో తొలి సెంచరీ చేసిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. అంతేకాదు తాను ఆడిన తొలి డే-నైట్ టెస్టులో సెంచరీ చేసిన రెండో భారతీయురాలిగా కూడా నిలిచింది. గతంలో బంగ్లాదేశ్‌పై టీమిండియా సారధి విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించాడు.
మంధాన ఇన్నింగ్సులో 19 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. అసలు ఆమె తొలి రోజే సెంచరీ చేయాల్సింది. కానీ వర్షం అంతరాయం కలిగించడంతో తొలిరోజు కేవలం 44 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. దీంతో ఆమె సెంచరీ రెండో రోజుకు వాయిదా పడింది. అయితే రెండో రోజు ఆటలో ఆమె అవుటయ్యే ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకుంది. రెండో రోజు రెండో ఓవర్లో పెర్రీ బంతికి క్యాచ్ అవుటైంది. కానీ ఆ బంతి నోబాల్ అని తేలడంతో ఊపిరి పీల్చుకుంది. ఇక, ఆఖరిసారిగా 2006లో ఇరు జట్లు టెస్టులో తలబడ్డాయి. మళ్లీ 15 ఏళ్ల తర్వాత ముఖాముఖీ టెస్టు పోరుకు ఇప్పుడు సిద్ధమయ్యాయి.
మిథాలీ రాజ్, వెటరన్ సీమర్ జులన్ గోస్వామి అప్పటి మ్యాచ్ ఆడారు. ఇప్పుడు వీళ్లిద్దరితో ఆడుతున్న వాళ్లంతా కొత్తవాళ్లే. ఇక మ్యాచ్ విషయానికొస్తే భారత్‌కు ఈ ఏడాది ఇది రెండో టెస్టు. ఇటీవల ఇంగ్లండ్ గడ్డపై జరిగిన ఏకైక టెస్టులో మిథాలీ సేన చక్కని పోరాటస్ఫూర్తి కనబరిచింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఆస్ట్రేలియా 2019లో యాషెస్ సిరీస్ ఆడాక మళ్లీ టెస్టులే ఆడలేదు. ఈ నేపథ్యంలో భారత అమ్మాయిలకు ఇంగ్లండ్ తో టెస్టు అనుభవం పైచేయి సాధించేందుకు దోహదం చేయొచ్చు.