ఆ సీఎం మునకేసేటప్పుడు పాము వచ్చింది

Update: 2015-07-15 07:07 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి పెను మప్పు తప్పింది. గోదావరి పుష్కరాల సందర్భంగా ధర్మపురిలో సతీ సమేతంగా పుష్కర స్నానం చేసే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెబుతున్నారు.

పండితులు సూచించిన ముహుర్తంలో పుష్కరాలకు శ్రీకారం చుట్టిన కేసీఆర్.. పూజలు నిర్వహించి పుష్కర స్నానం చేసి.. ఆ తర్వాత గోదారమ్మకు హారతి ఇచ్చారు. అయితే.. ఆయన స్నానం చేసే సమయంలో ఆయనకు ఎదురుగా ఒక పాము ప్రత్యక్షమైందని చెబుతున్నారు.

అక్కడే ఉన్న జాలర్లు వెంటనే స్పందించి.. బెలూన్ ట్యూబ్ తో దాన్ని పట్టేసి దూరంగా తీసుకెళ్లారని చెబుతున్నారు. పాము రావటాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గమనించలేదని చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులకు ముచ్చెమటలు పోశాయంటున్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు చేసే ఏ పనికి సంబంధించి అయినా.. మరింత అప్రమత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని తెలంగాణ అధికారులు ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.
Tags:    

Similar News