వరుసగా సామాజిక మాధ్యమాలు అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్‌కు షాకిస్తున్నాయి. ఇప్పటికే ట్విటర్‌తో తీవ్ర వాగ్వాదం ఏర్పడిన పరిస్థితిని మరవకముందే మరో సోషల్ మీడియా జలక్ ఇచ్చింది. ట్రంప్‌కు సంబంధించిన వార్త విశేషాలను తాము సర్క్యులేట్ చేయమని తేల్చిచెప్పింది. అదే స్నాప్‌చాట్. మెయిల్ బ్యాలెట్‌పై ట్రంప్ ట్విట్టర్ తో తీవ్రంగా విబేధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ట్రంప్‌కు ట్విట్టర్ షాకిస్తూ నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం అమెరికాలో జాతి హింస ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఈ విషయంలో ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నాడు. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా సంస్థలు ఆ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఫేస్‌బుక్ కూడా ట్రంప్ వ్యాఖ్యలపై అసంతృప్తిగానే ఉన్నా వ్యక్తపరచడం లేదు. ఇప్పుడు స్నాప్‌చాట్ డొనాల్డ్ ట్రంప్ కు షాక్ ఇచ్చింది. .ట్రంప్ పోస్టులను ప్రోత్సహించడం లేదని, ట్రంప్ వ్యాఖ్యలు జాతి హింసను ప్రేరేపించేలా ఉన్నాయని ఆరోపించారు. మేం స్నాప్‌చాట్ డిస్కవర్ ప్లాట్‌ఫామ్‌లో ట్రంప్ కంటెంట్ ను ప్రచారం చేయడం లేదు అని స్పష్టం చేసింది...
డిస్కవర్‌లో ఉచిత ప్రమోషన్ ఇస్తే జాతి హింస,అన్యాయాన్ని ప్రేరేపించే స్వరాలు, వార్తలను ప్రోత్సహించినట్టు అవుతుంది. దానికి మద్దతుగా ట్రంప్ వ్యాఖ్యలు చేస్తున్నాడని, అందుకే ట్రంప్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ట్వట్టర్, ఫేస్‌బుక్‌లను గందరగోళానికి గురి చేస్తున్నట్లు పేర్కొంది. ట్రంప్ పోస్ట్‌ను దాచడం ద్వారా ట్విట్టర్ గత వారంలో అపూర్వమైన వైఖరిని తీసుకుందిని స్నాప్‌చాట్ తెలిపింది.
ఈ సందర్భంగా స్నాప్‌చాట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (సీఈఓ) ఇవాన్ స్పీగెల్ తన సంస్థ ఉద్యోగులకు ఉత్తర్వులు జారీ చేశారు. ట్రంప్ అమెరికాలో జాతి అన్యాయం, హింస వారసత్వంగా భావించడాన్ని ఖండించాడు. మిన్నెసోటాలో ఒక నల్ల జాతీయుడిని పోలీసులు హతమార్చడం పై ఆగ్రహం వ్యక్తం చేసినందుకు టెక్ కంపెనీలపై చర్యలకు దిగడం దారుణమని మండిపడ్డారు. అమెరికాలో నల్ల జాతీయులపై జరుగుతున్న దాడులు తనను హృదయ విదారకంగా ఉన్నాయని, తనకు కోపం కలిగిస్తున్నాయని తెలిపారు. సేజింగ్ ప్లాట్‌ఫాం పై లేదా వెలుపల జాతి హింసను ప్రేరేపించే వ్యక్తులతో అనుసంధానించబడిన ఖాతాలను స్నాప్‌చాట్ యూఎస్‌లో ప్రోత్సహించదని స్పష్టం చేశారు..