ఆన్ లైన్ చదువులు వేస్టే.. ఎన్సీఈఆర్టీ సర్వే

Update: 2020-08-20 23:30 GMT
కరోనా వైరస్ తో స్కూళ్లు తెరిచే పరిస్థితి లేదు. దీంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఇప్పుడు మొత్తం ఆన్ లైన్ చదువులతో నెట్టుకొస్తున్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థలైతే మొత్తం అందులోనే బోధించేస్తున్నాయి. అయితే ఈ విద్యావిధానం విద్యార్థులకు అలవడిందా? వారికి సౌకర్యంగా ఉందా అనే దానిపై తాజాగా జాతీయ విద్యాపరిశోధన మరియు శిక్షణ సంస్థ ( ఎన్సీఈఆర్టీ) సర్వే నిర్వహించింది.

విద్యార్థులకు ఆన్ లైన్ చదువులతో చుక్కలు కనిపిస్తున్నాయని సర్వేలో తేలింది. స్కూళ్లతో పోలిస్తే ఇళ్లలో ఉండే సౌకర్యాల కొరతతో పాటు ఇతర సమస్యలూ విద్యార్థులను వేధిస్తున్నాయి. ఆన్ లైన్ చదువులు మొక్కుబడిగా సాగుతున్నాయని తేలింది.

విద్యార్థులకు ఇళ్ల వద్ద ఉండే వాతావరణంతోపాటు కరెంట్ కోతలు.. ఆన్ లైన్ విద్యకు అవసరమైన ఫోన్ , ట్యాబ్ లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల కొరత ఉందని తెలిపింది. 27శాతం మంది విద్యార్థులు కరెంట్ కోతలతో.. 28శాతం విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాల కొరతను ఎదుర్కొంటున్నట్టు సర్వేలో తేలింది.

ఆన్ లైన్ విద్యా విధానంతో సర్వేలో పాల్గొన్న 50శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కేంద్రం తెలిపింది. ఇక క్లాసులు హాజరు కావాలంటే ఇంటర్నెట్, సిగ్నల్స్, అప్ లోడ్ ఇబ్బందులు ఎదురవుతున్నట్టు చెబుతున్నారు.
Tags:    

Similar News