రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించి మూడేళ్ల నుంచి ఊరిస్తున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంతవరకు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించడం లేదు. పార్టీ ప్రకటిస్తారని ఏళ్లుగా ప్రచారం సాగుతున్నా ఆ మేరకు రజనీకాంత్ చర్యలు చేపట్టడం లేదు. అయితే తరచూ కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన నిర్ణయాలపై స్పందిస్తున్నారు. ఇటీవల సీఏఏకు మద్దతుగా, ఇతర నిర్ణయాలకు మద్దతు తెలిపి బీజేపీ తో సన్నిహితంగా ఉంటానన్నట్లు సంకేతాలు వచ్చాయి. దీనిపై తమిళనాడు లో దుమారం రేగాయి. అంతకు ముందు మరొకరి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించినా రావడానికి వెనకాముందు అవుతున్నారని తెలుస్తోంది. త్వరలోనే తమిళనాడు లో ఎన్నికలు రానున్నాయి. ఇప్పటికే రాజకీయంగా సిద్ధం కావాల్సి ఉన్నా రజనీకాంత్ ఆ మేరకు చర్యలు ఏం తీసుకోవడం లేదు. అయితే తాజాగా నిర్వహించిన అభిమానుల సమావేశం వివరాలకు బయటకు పొక్కడంతో రజనీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభిమానుల మధ్య 2017 డిసెంబర్‌లో తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు రజనీకాంత్ బహిరంగంగా ప్రకటించారు. అయితే రెండేళ్లు గా పార్టీని స్థాపించకున్నా తరచూ అభిమానులతో సమావేశమవుతున్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో పరిణామాలు ఎలా ఉన్నాయనే అంశం పై ఇటీవల తన అభిమానులతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ మేరకు కొడంబాక్కం జిల్లా రజనీ మక్కల్ మన్రం కార్యదర్శులతో సమావేశానికి ఆహ్వానించారు. ఫోన్ లో సమాచారం ఇచ్చి సమావేశానికి రావాలని పిలిచారు. ఈ మేరకు కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపం లో మార్చి 5వ తేదీన ఉదయం రజనీ మక్కల్ మన్రం జిల్లా కార్యదర్శులతో సమావేశమయ్యారు.అయితే సమావేశం వార్త విషయం మీడియాకు తెలిసి కల్యాణ మండపాలనికి మీడియా ప్రతినిధులు భారీగా వచ్చారు.
ఈ సమావేశం వార్తలు రెండు రోజుల క్రితమే మీడియాలో వార్తలు రావడం, పైగా రజనీ ఇల్లు, కల్యాణమండపం వద్ద పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు రావడం చూసి రజనీ అసహనం వ్యక్తం చేశారు. “మీకందరికీ వ్యక్తిగతంగా ఫోన్‌లో సమాచారం ఇస్తే మీడియా దృష్టికి ఎలా వెళ్లింది, అంతమాత్రం గోప్యం పాటించకపోతే ఎలా’ అంటూ కార్యదర్శులపై రజనీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మిమ్మల్ని నమ్మి మోసపోయానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో కార్యదర్శులు, అభిమానులు చిన్నబుచ్చుకున్నారు. సమావేశానికి తమిళనాడులోని అన్ని ప్రాంతాల నుంచి 37 మంది కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సమావేశం సందర్భంగా వారి అందరి సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని లోపలికి అనుమతించారు. సుమారు గంటన్నరపాటు రజనీ వారితో సమావేశమయ్యారు.
రాష్ట్రం, దేశంలో పరిస్థితులు, రాజకీయ నిర్ణయాలు, వచ్చే ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలనే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీలో ముఠా తగాదాలు, వర్గ పోరాటాలను ఎంతమాత్రం సహించను, అలాంటి వారు ఎవరైనా ఉంటే వెళ్లిపోండి అని చెప్పినట్లు సమాచారం. మన్రం నిర్వాహకుల్లోని విబేధాలు పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తాయని గుర్తించి అందుకే తాను “మోసపోయాను’ అనే పదం వాడినట్లు తమిళనాడులో చర్చ సాగుతోంది. పార్టీ ఏర్పాట్లకు సంబంధించి అంతర్గత విషయాలు, రాజకీయ ప్రవేశం ప్రకటించడంతో పాటు ఆ వెంటనే సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, బూత్ కమిటీలను ఏర్పాటు తదితర అంశాలపై చర్చించినట్లు అభిమానులు చెబుతున్నారు. ఈ మేరకు త్వరలోనే రజనీ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారి పార్టీని ప్రకటిస్తారనే ప్రచారం తమిళనాడు లో జోరుగా సాగుతోంది.