బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన లిజ్ ట్రస్ పై ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. ఆమెకు మాజీ ప్రధానిగా లభించే ఎలాంటి భత్యాలను ఇవ్వరాదని.. డిమాండ్ చేస్తున్నారు.''అసలు 45 రోజులే ప్రధానిగా ఉన్న ఆమె దేశానికి ఏం చేశారు? ఎందుకు కోట్ల రూపాయల్లో భత్యాలు ఇవ్వాలి. ఇదంతా మా కష్టార్జితం. ఇవ్వొద్దు!! '' అని సోషల్ మీడియా కేంద్రంగా నిరసనలు మిన్నంటుతున్నాయి.
ప్రధాని పదవికి రాజీనామా చేసిన లిజ్ ట్రస్.. బ్రిటన్‌లో అతి తక్కువ కాలం ఆ పదవిలో ఉన్న వ్యక్తిగా నిలిచారు. అయినప్పటికీ తదనంతరం ప్రభుత్వం నుంచి ప్రతిఏటా సుమారు రూ.కోటి భత్యాన్ని పొందేందుకు అర్హత సాధించారు. వివాదాస్పద నేతగా రాజీనామా చేసిన ఆమెకు ఈ భత్యాన్ని ఇవ్వవద్దనే వాదన బ్రిటన్ ప్రజలు జోరుగా వినిపిస్తున్నారు.
సంపన్నులకు పన్ను రాయితీలను కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం కావడం.. ఆర్థిక వ్యవస్థ క్షీణించడం వంటి కారణాలతో బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేశారు. అయితే, పదవిలో ఉన్నది కేవలం 45 రోజులే అయినప్పటికీ తదననంతరం ఏడాదికి సుమారు రూ.1.05 కోట్లు (1,15,000 పౌండ్లు) ప్రభుత్వం నుంచి జీవితాంతం భత్యంగా అందుకోనున్నారు.
బోరిస్ జాన్సన్ రాజీనామాతో నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన లిజ్‌ట్రస్ ఏడు వారాలు కూడా ఆ పదవిలో కొనసాగలేకపోయారు. దీంతో బ్రిటన్‌కు అతితక్కువ కాలం పాటు ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా యూకే చరిత్రలో నిలువనున్నారు. పనిచేసింది తక్కువ సమయమే అయినా పబ్లిక్ డ్యూటీ కాస్ట్ అలవెన్స్ పొందేందుకు అర్హత పొందారు.
దీంతో లిజ్ ట్రస్ జీవితాంతం ఈ భత్యాన్ని అందుకోనున్నారు. మాజీ ప్రధానమంత్రులకు జీవితాంతం సహాయం అందించేందుకు 1991లో దీనిని ప్రవేశపెట్టారు.
పదవిలో లేకున్నా ప్రజా జీవితంలో చురుకుగా పాల్గొనే ఉద్దేశంతో ఈ భత్యాన్ని అందిస్తారు. మాజీ ప్రధానిగా ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం, కార్యాలయ ఖర్చులు, సిబ్బంది వేతనాల కోసం మాత్రమే వీటిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఖర్చు చేసిన బిల్లులకు మాత్రమే ఈ భత్యం చెల్లిస్తారు. అయితే, ప్రజలు లిజ్ ట్రస్‌కు ఈ మొత్తాన్ని ఇవ్వరాదని..ఆ మెను అనర్హురాలిగా ప్రకటించాలని.. సోషల్ మీడియాలో ఫైట్ చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.