కేంద్రం ఇచ్చిన నిధులు బాబు సోకులకే సరిపోయింది : సోము వీర్రాజు

Update: 2020-08-15 14:30 GMT
ఈ మద్యే ఆంధ్రప్రదేశ్ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన సోము వీర్రాజు ... విమర్శల పర్వాన్ని మొదలుపెట్టారు. ఏపీలో బీజేపీ అభివృద్దే ద్యేయంగా అధ్యక్ష పదవి భాద్యతలు చేపట్టిన సోము వీర్రాజు, ఏపీకి బీజేపీ ఏంచేసిందో వివరించే పనిలో పడ్డారు. ఈ తరుణంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి , ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు పై మండిపడ్డారు. ముఖ్యంగా పోర్టుల విషయంలో బాబు పై విమర్శల వర్షం కురిపించారు. పోర్టులు నిర్మించేందుకు గతంలోనే కేంద్రం నిధులు విడుదల చేసినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శించారు.

విశాఖ జిల్లా పాయకరావు పేటలో ఆయన మాట్లాడుతూ ..చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం మంజూరు చేసిన విద్యుత్ సబ్‌ స్టేషన్‌లో షిప్ట్‌ ఆపరేటర్ పోస్ట్ ‌లను టీడీపీ నేతలు అమ్ముకున్నారని, కేంద్రం విడుదల చేసిన నిధులతో చంద్రబాబు సర్కారు సోకులు చేసిందని అన్నారు.చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో కనీసం ఒక్క పోర్టు కూడా నిర్మించలేదని , ఆ పనుల కోసం కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించారని ఆయన విమర్శలు చేశారు. రాష్ట్రంలో పోర్టులు నిర్మించకపోవడం వలనే ఇక్కడ జీవనం కొనసాగించలేని మత్య్సకారులు ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారని , రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాగర తీరంలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. గతంలో చంద్రన్న బాట పేరిట వేసిన రోడ్లకు బీజేపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని అయన స్పష్టతను ఇచ్చారు. మొత్తంగా సోము వీర్రాజు మాటల బట్టి చూస్తే గత ప్రభుత్వ చేసిన మాటల గారడీ చిన్న పిల్లలకి కూడా స్పష్టంగా అర్థం అవుతుంది.
Tags:    

Similar News