కాంగ్రెస్ చేయ‌లేదు..మీరు చేయొచ్చుగా వీర్రాజు?

Update: 2017-06-05 09:19 GMT
ఈ మ‌ధ్య‌న వేలెత్తి చూపించ‌టం ఒక అల‌వాటుగా మారిపోయింది. మీడియా ముందుకు వ‌చ్చి ఏమైనా మాట్లాడొచ్చు అనే భావ‌న ఏపీకి చెందిన కొన్ని పార్టీ నేత‌ల‌కు బాగా అల‌వాటైంది. మిగిలిన రాష్ట్రాల్లో ఇదే తీరులో మాట్లాడితే.. నిల‌దీయ‌టం ఖాయం. కానీ.. ఏపీలో అలాంటి ప‌రిస్థితి లేక‌పోవ‌టం.. ఆంధ్రోళ్లంతా తమ ఫీలింగ్స్ ను క‌డుపులో దాచుకొని టైం వ‌చ్చిన‌ప్పుడు స‌మాధానం ఇవ్వ‌టం అల‌వాటుగా మార‌టంతో.. ఇప్ప‌టికిప్పుడు డ్యామేజ్ కంట్రోల్‌ లో భాగంగా అడ్డ‌దిడ్డంగా మాట్లాడేస్తున్నారు.

హోదా అంశంపై గుంటూరులో స‌భ‌ను నిర్వ‌హించిన కాంగ్రెస్ పార్టీ.. తాము కానీ 2018లో అధికారంలోకి వ‌స్తే.. తాము చేప‌ట్టే మొద‌టి ఫైల్ ఏపీ హోదా అంశ‌మేనంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేయ‌టం తెలిసిందే. దీంతో.. హోదా అంశాల్ని మూట గ‌ట్టి గోతిలో పాతేసిన బీజేపీ.. ఇప్ప‌టికిప్పుడు ఈ అంశంపై వివ‌ర‌ణ ఇవ్వ‌టంతో పాటు.. కాంగ్రెస్ మీద ఎదురుదాడి చేసేయాలని డిసైడ్ అయ్యింది.

ఇలాంటి అంశాల‌పై వెంట‌నే స్పందించే ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు రియాక్ట్ అయ్యారు. ఏపీకి కాంగ్రెస్ ఏం చేసింద‌న్న దానిపై తాను ఏపీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరాతో బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని స‌వాలు విసిరారు. కాంగ్రెస్ పార్టీ ఏపీకి తీర‌ని అన్యాయం చేసింద‌న్నారు. చివ‌ర‌కు భ‌ద్రాచ‌ల రాముడిని కూడా ఏపీకి రాకుండా చేసిందంటూ ఫైర్ అయ్యారు.

ఒక‌వేళ‌.. సోము వీర్రాజుకు అంత బాధే ఉంటే.. ఇప్పుడు రాష్ట్రంలోనూ అంత‌కు మించి కేంద్రంలోనూ అధికారంలో ఉన్న‌ది వారే. అలాంట‌ప్పుడు విభ‌జ‌న కార‌ణంగా జ‌రిగిన న‌ష్టాన్ని భ‌ర్తీ చేయొచ్చు క‌దా? దుమ్ముగూడెం ప్రాజెక్టు నుంచి గ్రావిటీ కింద ఏపీకి రావాల్సిన 200 టీఎంసీల నీటిని రాకుండా చేసింది కూడా కాంగ్రెస్సే న‌న్న సోము వీర్రాజు.. ఆ పార్టీ త‌ప్పుల్ని స‌రిదిద్దొచ్చుగా అన్న ప్ర‌శ్న‌కు ఏం స‌మాధానం చెబుతారు? విమ‌ర్శించ‌ట‌మే ప‌నిగా పెట్టుకునే బ‌దులు ఏపీకి ఏదైనా చేద్దామ‌న్న మాట‌ల కంటే.. చేత‌ల్లో చూపిస్తే.. ర‌ఘువీరారెడ్డి లాంటి వారు మాట‌లు ప‌డుతున్న‌ట్లుగా తాము భ‌విష్య‌త్తులో ప‌డ‌మ‌న్న విష‌యాన్ని వీర్రాజు గుర్తిస్తే మంచిద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News