సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేష్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. చెన్నై - కోల్ కతా నేషనల్ హైవేపై ప్రయాణిస్తున్న మహేష్ కారు.. ముందు ప్రయాణిస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేష్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో.. తొలుత అతన్ని నెల్లూరులోని ఓ ఆసుపత్రి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో.. వెంటనే చెన్నైకి తరలించారు.
అయితే.. ఆయన వైద్య సహాయానికి ఏపీ సర్కారు రూ.17 లక్షలు మంజూరు చేసింది. దీంతో.. రాజకీయ రగడ మొదలైంది. ప్రజాధనాన్ని ఒక వ్యక్తికి ఏవిధంగా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. తాజాగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమూ వీర్రాజు సైతం ఈ విషయమై ప్రశ్నించారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహేష్ ముఖానికి, తలకు తీవ్ర గాలయ్యాయి. దీంతో ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి ఖరీదైన వైద్యం అందించారు. మహేష్ కళ్లు, ముక్కుతోపాటు మరికొన్ని ఎముకలు దెబ్బతిన్నాయి. ఆయన ఎడమ కంటి చూపును పూర్తిగా కోల్పోయారని కూడా మీడియాలో వార్త ప్రసారమైంది. అయితే.. ఆ తర్వాత ఆయన రెండు కళ్లూ బాగానే ఉన్నాయని, ప్రాణాలకు సైతం ప్రమాదం లేదని వైద్యులు ప్రకటించారు.
అయితే.. కత్తి మహేష్ కు ప్రభుత్వం 17 లక్షల రూపాయలు అందించడాన్ని సోమూ వీర్రాజు తప్పుబట్టారు. కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారు, వైద్యం కోసం ఆస్తులు అమ్ముకున్నవారు ఎందరో ఉన్నారని, అలాంటి వారికి కాదని మహేష్ కు అంత డబ్బు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సహాయ నిధిని అర్హులకు కాకుండా.. హైదరాబాద్ ఖరీదైన భవనాల్లో నివసించే కత్తి మహేష్ కు ఇవ్వడమేంటని అన్నారు. 40 లక్షల రూపాయల విలువైన కారులో తిరిగే కత్తి మహేష్ కు ప్రజాధనాన్ని ఇవ్వడాని అంగీకరించబోమని సోమూ వీర్రాజు అన్నారు.