బీజేపీ నెత్తిన గుదిబండ‌.. సోముపై ఈ విమ‌ర్శ‌లెందుకు?

Update: 2021-10-06 09:30 GMT
ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు.. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు.. ఆర్ ఎస్ ఎస్ భావ‌జాలం పుణికి పు చ్చుకున్న నేత‌.. సోము వీర్రాజు. కొన్నేళ్లు చేసిన కృషితో ఆయ‌న ఏపీ బీజేపీ ప‌గ్గాలు చేప‌ట్టారు. అంతేకా దు.. ఈయ‌న‌కు ప‌ద‌వి ఇవ్వ‌డం ద్వారా.. త‌ట‌స్థ ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉన్న ఏపీలో బీజేపీ పుంజుకుంటుంద‌నే భారీ ఆశ‌లు కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలో ప‌గ్గాలు చేప‌ట్టిన సోముకూడా బీజేపీ అధిష్టానం ఆశ‌ల‌ను నెర‌వేరుస్తామ‌ని హామీ ఇచ్చారు. అయితే.. ఇప్ప‌టికి ఏడాదిన్న‌ర అయినా.. పార్టీలో కీల‌క మార్పులు తేలేక పోయారు. అంతేకాదు.. వ్యూహాత్మ‌కంగా ఆయ‌న ముందుకు సాగ‌లేక పోతున్నారు.

రాష్ట్రంలో పుంజుకునేందుకు గ్యాప్ ఉన్నా.. ఆ దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం లేదు. అంతేకాదు.. ఒక‌టికి మించి ఎక్కువ‌గానే .. ప‌రాజ‌యాలు క‌నిపిస్తున్నా.. మార్పు క‌నిపించ‌డం లేదు. గ‌త ఎన్నిక‌ల‌ను చూసుకుంటే.. బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. పంచాయ‌తీ ఎన్నిక‌లు, తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌ల్లోనూ బీజేపీ స‌త్తా నిరూపించుకో లేక పోయింది. అయిన‌ప్ప‌టికీ దిద్దుబాటు చ‌ర్య‌ల దిశ‌గా పార్టీ పుంజుకోలేక పోతోంద‌నే వాద‌న వినిపిస్తోంది. వాస్త‌వానికి ఏ పార్టీకైనా.. ఒక ప‌రాజ‌యం అనేక పాఠాలు నేర్పిస్తుంది. కానీ.. బీజేపీలో మార్పు క‌నిపించ‌డం లేదు. పైన ప‌టారం.. అన్న విధంగా రాష్ట్ర బీజేపీ అడుగులు వేస్తుండ‌డం విస్మ‌యానికి గురిచేస్తోంది.

నిజానికి క్షేత్ర‌స్థాయిలో బీజేపీకి చాలానే వ్య‌తిరేక‌త ఉంది. హోదా, పోల‌వ‌రం, అమ‌రావ‌తి విష‌యంలో కేంద్రం వ్య‌వ‌హ‌రించిన తీరును.. ప్ర‌జ‌లు జీర్ణించుకోలేక పోతున్నారు. అయినా..ఇవేవీ త‌మ‌కు క‌నిపించ న‌ట్టుగా సోము వీర్రాజు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో కేంద్రం ఎంతో చేస్తోంద‌ని ఆయ‌న చెబుతున్నా.. న‌మ్మే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఇలా ఉంటే.. పార్టీలో సొంత నేత‌ల మ‌ధ్య అసంతృప్తులు పెరిగిపోయాయి. వీటన్నింటినీ చ‌క్క‌దిద్ది.. పార్టీని ముందుకు తీసుకువెళ్లాల్సిన సోము.. గ‌తంలో అద్వానీ భార‌త్ వెలిగిపోతోంద‌ని అన్న‌ట్టుగా.. ఏపీలో తాము అధికారంలోకి వ‌చ్చేస్తామంటూ.. దంచికొడుతున్నారు.

ప్ర‌స్తుతం బ‌ద్వేల్ ఉప ఎన్నిక తెర‌మీద‌కి వ‌చ్చింది. దీనికి టీడీపీ దూర‌మైంది.. ఇక‌, బీజేపీతో పొత్తులో ఉన్న జ‌న‌సేన కూడా దూర‌మైంది. అయిన‌ప్ప‌టికీ.. బీజేపీ చీఫ్ సోము మాత్రం తాము ఇక్క‌డ నుంచి పోటీ చేస్తామ‌ని చెబుతున్నారు. ఇలాంటి ప్ర‌యోగాలు చేయ‌డం అవ‌స‌ర‌మా? అనేది బీజేపీ నేత‌లే పెద‌వి విరుస్తున్న అంశం. ఒక‌వేళ ఇక్క‌డ పోటీ చేసినా.. గెలిచే ప‌రి స్థితి లేదు. ఎందుకంటే.. జ‌గ‌న్‌కు , ఆయ‌న పార్టీకి కంచుకోట వంటి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో.. ఖ‌చ్చితంగా వైసీపీ గెలుస్తుంది. అయిన‌ప్ప‌టికీ.. సోము దూకుడు మామూలుగా క‌నిపించ‌డం లేదు. ఈ ప‌రిణామాల‌ను గ‌మనిస్తున్న‌వారు.. బీజేపీ వ్యూహంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. సోము కు ఆలోచ‌న త‌క్కువ‌.. ఆవేశం ఎక్కువ అనేధోర‌ణిలో ఉన్నార‌ని.. పార్టీకి గుదిబండ‌గా మారార‌ని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. మ‌రి ఆయ‌న వైఖ‌రి ఇప్ప‌టికైనా మారుతుందా? లేదా? చూడాలి!!




Tags:    

Similar News