ఒక్కోసారి కొందరు నేతలకు పెద్దగా కష్టపడకుండానే జాతీయ స్ధాయిలో గుర్తింపు వచ్చేస్తుంది. బీజేపీ చీఫ్ సోము వీర్రాజుకు ఇపుడు అలాంటి స్టార్ డమ్మే రాత్రికి రాత్రి వచ్చేసింది. ఇంతకీ ఆయన చేసిందేమంటే బీజేపీ అధికారంలోకి రాగానే చీప్ లిక్కర్ ను 75 రూపాయలకే అందిస్తామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో తాగుబోతులు కోటిమంది బీజేపీకే ఓట్లు వేస్తే అధికారం కచ్చితంగా తమకే వస్తుందని ధీమా వ్యక్తంచేశారు.
విజయవాడలో నిర్వహించిన ప్రజాగ్రహ సభలో వీర్రాజు చేసిన పై వ్యాఖ్యలే ఇపుడు అయన్ను జాతీయ స్ధాయికి తీసుకెళ్ళిపోయాయి. మంగళవారం సాయంత్రం వీర్రాజు పై వ్యాఖ్యలు చేస్తే బుధవారం ఉదయానికల్లా పెద్ద స్టార్ అయిపోయారు. నిజానికి వీర్రాజు లాంటి సీనియర్ నేత చేయాల్సిన వ్యాఖ్యలు కావవి. ఎందుకంటే తాము అధికారంలోకి వస్తే ప్రజల సంక్షేమానికి ఏమి చేస్తామో అది చెప్పాలి. రాష్ట్రాభివృద్ధికి తాము తీసుకోబోయే చర్యలేమిటో వివరించాలి.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను సాధిస్తామని చెప్పాలి. అయితే వీర్రాజు మాత్రం చీప్ లిక్కర్ ను 75 రూపాయలకే ఇస్తామని చెప్పటమే చాలా చీపుగా ఉంది. పైగా ఆర్ధికంగా డెవలప్ అయితే 50 రూపాయాలకే ఇస్తామని హామీ ఇచ్చారు. పైగా రాష్ట్రంలో కోటిమంది మందుబాబులున్నట్లు వీర్రాజు దేని ప్రకారం లెక్కగట్టారో అర్ధం కావటంలేదు. మందుబాబులు కోటి మంది తమకే ఓట్లేస్తే బీజేపీ అధికారంలోకి రావటం పక్కా అంటు ఓ పిచ్చి లెక్క చెప్పారు.
రాష్ట్రంలో ప్రస్తావించేందుకు అనేక సమస్యలున్నాయి. వాటిన్నింటినీ వదిలిపెట్టేసిన వీర్రాజు చీపు లిక్కర్ ను మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించటాన్ని తెలంగాణాలో, పశ్చిమబెంగాల్లో అధికార పార్టీ నేతలు పదేపదే ప్రస్తావిస్తున్నారు. తెలంగాణా మంత్రి కేటీఆర్ మాట్లాడుతు చీప్ లిక్కర్ ను 75 రూపాయలకే ఇస్తానని చెప్పిన వీర్రాజు హ్యాట్సాఫ్ చెప్పారు. వాటే స్కీం.. వాటే షేమ్ అంటు ఎద్దేవా చేశారు. ఇక బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ వీర్రాజు ఇచ్చిన చీపు లిక్కర్ హామీ జాతీయ పార్టీ విధానమేనా అంటూ ఎద్దేవా చేశారు.
బీజేపీ నేతలకు చీపుగా చీపు లిక్కర్ గురించి తప్ప ఇంకే ఆలోచన వస్తుందంటు పదే పదే ప్రస్తావిస్తున్నారు. వీర్రాజు ఏ మూడ్ లో ఉండి చీపు లిక్కర్ హామీ ఇచ్చారో తెలీదు కానీ ఇపుడదే చీపులిక్కర్ హామీ బాగా వైరల్ అయిపోయింది. అందుకనే సీపీఐ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ సోము వీర్రాజును సారాయి వీర్రాజుగా మార్చేశారు.