వైసీపీ మంత్రుల గాలి తీసేసిన సోము...?

Update: 2022-02-19 16:48 GMT
ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు నోరు చేస్తే ప్రత్యర్ధి పార్టీలు తట్టుకోవడం కష్టమే. ఆయన జోరుకు ఒక్కోసారి టంగ్ స్లిప్ అయి వివాదాలు కూడా అయిన సందర్భాలు ఉన్నాయి. అయినా సరే తగ్గేదే లే అంటారు వీర్రాజు. ఆయన ఈ మధ్య వైసీపీ మీద హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ అధికార పార్టీకి గుక్క తిప్పుకోనీయకుండా చేస్తోంది.

ఆయన తాజాగా  ఉత్తరాంధ్రా టూర్లో వైసీపీ మంత్రుల మీద చేసిన కామెంట్స్ షాకింగ్ గా ఉన్నాయి. వైసీపీ మంత్రులు అంతా అలంకారప్రాయులే అని గాలి తీసేశారు. వారి దగ్గర అసలైన పవర్ లేదన్నట్లుగా సోము మాట్లాడారు. ఒక విధంగా మంత్రులు తాము చెప్పుకోవడానికే అన్నట్లుగా ఉన్నారని సోము ఇండైరెక్ట్ గా కామెంట్స్ ఉన్నాయి.

శ్రీకాకుళం జిల్లా మంత్రి సీదరి అప్పలరాజు  తన సొంత నియోజకవర్గం పలాసాలో ఆఫ్ షోర్ ప్రాజెక్టు కోసం కనీసం నాలుగు కోట్లు ప్రభుత్వం నుంచి తెచ్చుకోలేకపోయారు అంటే ఏమనుకోవాలని సోము నిలదీశారు. ఉత్తరాంధ్రా దుస్థితికి వైసీపీ పాలకులే కారణం అని ఆయన మండిపడ్డారు.

ఉత్తరాంధ్రా సాగునీటి ప్రాజెక్టుల మీద మంత్రులకు పట్టదు, ప్రభుత్వానికీ అసలు  పట్టదని ఆయన విమర్శించరు. అయితే బీజేపీ ఈ విషయంలో అసలు చూస్తూ ఊరుకోదని, కచ్చితంగా తాము పోరాటం చేసి తీరుతామని కూడా సోము స్పష్టం చేస్తున్నారు. కేవలం ప్రభుత్వాల నిర్లక్షయం వల్లనే ఉత్తరాంధ్రా దారుణంగా వెనకబడింది అని సోము ఆరోపించారు.

అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోలేని పాలన ఏపీలో సాగుతోందని ఆయన దుయ్యబెట్టారు. ఉత్తరాంధ్రా వలసలకు పాలకుల తీరే కారణం అని ఆయన అన్నారు. తాగు నీరు, సాగునీరు అందించలేని  పాలన ఎందుకని ఆయన అన్నారు. ఇక ప్రభుత్వాన్ని రైస్ మిల్లర్స్ మోసం చేస్తున్నారు అని సోము ఆరోపించారు.

రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేస్తోంది దళారులు, మిల్లర్లు మాత్రమేనని, రైతు భరోసా కేంద్రాలు కేవలం నామమాత్రమని సోము అన్నారు. అందువల్ల పౌర సరఫరాల శాఖను రద్దు చేసుకోవడం మంచిదని ఆయన సలహా ఇచ్చారు. కేవలం ట్రాన్స్ పోర్టు పేరిట వందల కోట్ల రూపాయలను అధికారులు మిల్లర్లు కలసి పంచుకుంటున్నారని, ఇదంతా ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనమని ఆయన విమర్శించారు.

ఏపీలో మంచి బియ్యం నలభై రూపాయలు పెట్టినా దొరకడం లేదు అంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తోందో అర్ధమవుతోందని సోము అన్నారు. మొత్తానికి ఉత్తరాంధ్రా టూర్ లో సోము చేసిన పలు హాట్  కామెంట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి. మరి దీనికి వైసీపీ నేతల రియాక్షన్ ఎలా అన్నదే చూడాలి.
Tags:    

Similar News