పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే - బీజేపీ నేత టీ నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్ కు షాక్ తగిలింది. హైదరాబాద్ మాదాపూర్ లోని నోవాటెల్ ఆర్టిస్ట్రీ పబ్‌లో వీరంగం సృష్టించడం - సినీనటితో పాటు ఆమె స్నేహితురాల్లతో అసభ్యంగా ప్రవర్తించిన ఉదంతం పెద్ద ఎత్తున వైరల్ అవడం...మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేయడం తెలిసిన సంగతే. సినీనటి ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే, ఆశిష్ గౌడ్ కు ఊహించని షాక్ తగిలింది.
మాదాపూర్ లోని నోవాటెల్ హోటల్ లోని పబ్ లో ఫుల్లుగా మద్యం సేవించిన అశీష్ గౌడ్ అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని - అంతేగాకుండా తమపై దాడికి ప్రయత్నించాడని బిగ్ బాస్-2 కంటెస్ట్ సంజన మరి కొందరు అమ్మాయిలు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చేయిపట్టి లాగడమే గాకుండా బూతులు తిట్టాడని..అశీష్ ప్రవర్తనతో భయమేసిందని చెప్పారు. అశీష్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నా హోటల్ సిబ్బంది పట్టించుకోలేదని చెప్పింది. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆశిష్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నేపథ్యంలో రాష్ట్ర అధిష్టానం సీరియస్‌గా స్పందించి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడి ఎం.నరేందర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేయడంతో ఆయన సస్పెండ్ చేస్తూ పత్రిక ప్రకటన విడుదల చేశారు.
ఇదిలాఉండగా - ఆశిష్ గౌడ్ తోపాటు మరో ఇద్దరు నిందితులపై ఐపీసీ 354. 354ఏ - 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతోపాటుగా ఆర్టిస్ట్రీ పబ్ లోని సీసీ కెమేరాల వీడియో ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని - త్వరలోనే వారిని పట్టుకొంటామని మాదాపూర్ పోలీసులు తెలిపారు.