సలహాలు అన్ని ఇచ్చిన సోనియా దాన్ని టచ్ చేయలేదే?

Update: 2020-04-07 13:00 GMT
సలహాలు అన్ని ఇచ్చిన సోనియా దాన్ని టచ్ చేయలేదే?
  • whatsapp icon
యుద్ధం చేయటం మామూలు విషయం కాదు. కంటి ముందు కనిపించే శత్రువు తో మర ఫిరంగులు.. శత్నఘ్నులతో.. మందుగుండు సామాగ్రితో ధ్వంసం చేయటం పెద్ద విషయం కాదు. కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేయటం అంత తేలికైన విషయం కాదు. ఇప్పుడు అలాంటి పనినే చేస్తోంది ప్రపంచం. కరోనా వైరస్ మీద సమరం చేస్తున్న మోడీ సర్కారు.. అన్ని వర్గాల వారి నుంచి సలహాలు.. సూచనలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే విపక్ష నేతలకు ప్రత్యేకంగా ఫోన్లు చేసిన మోడీ.. వారందరిని సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు.

దీనికి స్పందించారు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ. కరోనా మీద సలహాల్ని ఇస్తూ.. ఒక లేఖ రాశారు. ఇప్పటికే మోడీ సర్కారు తీసుకున్న కొన్ని చర్యలకు ఆమె ఓకే చెప్పారు. ఎంపీల జీతాలకు కోత విధించాలన్న మోడీ సర్కారు నిర్ణయాన్ని స్వాగతించారు. అంతేకాదు.. మీడియాకు ఇచ్చే యాడ్ల మీద కూడా రెండేళ్లు నిషేధాన్ని విధించాలని పేర్కొన్నారు. అంతేకాదు. . కొత్త పార్లమెంటు సెంట్రల్ విస్టా ప్రాజెక్టును పక్కన పెట్టాలన్నారు.ఇప్పుడున్న పార్లమెంటుభవనంలోనే కార్యకలాపాలు నిర్వహించాలన్నారు.

ప్రభుత్వం తన ఖర్చును ముప్ఫై శాతం తగ్గించుకోవాలన్న ఆమె.. కేంద్రమంత్రులు.. అధికారులు విదేశీ ప్రయాణాల్ని రద్దు చేసుకోవాలన్నారు. పీఎం కేర్స్ నిధులను.. పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ కు బదిలీ చేయాలన్న ఆమె.. అలా సమకూరే ధనంతో కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచన చేశారు. ఇవన్నీ బాగానే ఉన్నా.. అన్నింటికంటే కీలకమైనది.. లాక్ డౌన్ ను కొనసాగించాలా? లేదా? అనే ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించకుండా సలహా ఇవ్వటం ఏమిటి? అన్నది క్వశ్చన్. ఖర్చు తగ్గించుకోవటం.. కోత పెట్టటం లాంటి వాటితో పాటు.. కరోనా కట్టడికి ఏం చేయాలో సోనియమ్మ ఎందుకు చెప్పనట్లు?
Tags:    

Similar News