వాళ్ల ఆశలు అడియాశలు చేసిన మేడమ్

Update: 2020-02-18 11:00 GMT
స్వరాష్ట్రం ఇచ్చి ఏడేళ్లవుతోంది.. ఇంకా ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. కానీ పదవులు కోసం మాత్రం ఉబలాట పడుతున్న వారి సంఖ్య మాత్రం భారీగా ఉంది. పార్టీ కోసం పని చేయరు కానీ పదవులు కావాల్న అని మేడమ్ అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో పార్టీకి పెద్దగా ప్రయోజనం చేకూరలేదు.. నాయకులు ఎక్కువ.. క్యాడర్ తక్కువ అంటూ మేడమ్ అగ్రహం వ్యక్తం చేసి ఈసారి పార్టీ అధ్యక్షుడి మార్పు లేనే లేదంటూ కుండబద్దలు కొట్టింది. దీంతో అధ్యక్ష పీఠంపై ఆశలు పెట్టుకున్న నాయకులు నిరాశకు గురయ్యారు. వారి ఆశలన్నీ అడియాశలవడంతో ఆవేదన చెందారు. కాకపోతే ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న వ్యక్తికి మాత్రం ఇది తీపి కబురే. ఇంతకు ఏ పార్టీ.. ఏ మేడమ్ అంటే.. కాంగ్రెస్ పార్టీ అధినేత్ర సోనియా గాంధీ. విషయం తెలంగాణ రాష్ట్రానికి సారథి.

ఆంధ్రప్రదేశ్ లో నష్టపోయినా తెలంగాణ లో లాభపడతామనే ఉద్దేశం తో పార్టీ అధిష్టానం 2014లో తెలంగాణ రాష్ట్రం ప్రకటించింది. రాష్ట్రం ఇచ్చినా పార్టీకి కలిసి రాలేదు. 2014లో కొంత ఫలితాలు ఆశాజనకం గా ఉన్నా 2018 ముందస్తు ఎన్నికల్లో దారుణ ఫలితాలు చవిచూసింది. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్ష పదవిలో మార్పు రానుందని, కొత్త వ్యక్తికి పార్టీ రాష్ట్ర పగ్గాలు ఇస్తారని వార్తలు చక్కర్లు కొట్టాయి. దానికి పరిణామాలు, వాతావరణం కూడా అనుకూలంగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నాయకుల్లో ఆశలు రేగాయి. పార్టీ అధ్యక్ష పదవి తమకంటే తమకు కావాలంటూ పోటీ పడ్డారు. ఈ పదవి కోసం అధిష్టానం చుట్టూ నాయకులు తిరిగారు. ఎప్పుడు ఎన్నికలు అయిపోయినా పార్టీ చీఫ్ మార్పు అనే వార్త బయటకు వస్తోంది. ఈ క్రమంలో పార్టీ అధ్యక్ష పదవికి భారీ సంఖ్యలో నాయకులు పోటీపడుతున్నారు.

ముఖ్యంగా ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీమంత్రి జానారెడ్డి, కొమటిరెడ్డి సోదరులు, పొన్నం ప్రభాకర్, జగ్గారెడ్డి, విజయశాంతి ఇంకా చాలా మంది ఉన్నారు. అయితే కురువృద్ధుడు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు కూడా పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. దీంతోనే పార్టీలో వర్గ విభేధాలు బయటపడుతున్నాయి. పలుసార్లు రచ్చకెక్కాయి కూడా.

అయితే ఇటీవల పార్టీ నాయకులు ఢిల్లీకి వెళ్లగా వారికి మేడమ్ షాకింగ్ న్యూస్ చెప్పిందంట. ఎన్నికల్లో ప్రభావం చూపలేని వ్యక్తులు పార్టీ అధ్యక్ష పదవి కావాలంటారా అని ప్రశ్నించారని సమాచారం. నాయకులు ఎక్కువ.. క్యాడర్ తక్కువ అని అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముందే పార్టీ పరిస్థితి బాగాలేదు.. ఈ సమయంలో రిస్క్ ఎందుకనే ఉద్దేశంతో పార్టీ అధ్యక్షుడిని మార్చే ప్రసక్తే లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డే కొనసాగుతారని స్పష్టం చేశారని పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్న మాట. ఒకరంటే ఒకరికి పడది ఈ పరిస్థితిలో మారిస్తే కష్టమని భావించి మేడమ్ ఆ నిర్ణయం తీసుకున్నారంట. దీంతో అధ్యక్ష స్థానంపై ఆశపడిన వారికి నిరాశే ఎదురైంది. మేడమ్ చెప్పిన మాటతో ఒక్కరూ నోరు

మెదపకుండా తిరుగుబాట పట్టారంట. ఈ పరిస్థితిలో విజయశాంతి సినిమాల్లోకి వెళ్లడం.. మాకే సీటు అనుకున్న కొమటిరెడ్డి బ్రదర్స్ ప్రస్తుత పరిస్థితి ఏమిటో.



Tags:    

Similar News